Share News

NRI: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోతో వార్ వన్ సైడే: అశోక్ గౌడ్ దూసరి

ABN , First Publish Date - 2023-10-17T10:26:11+05:30 IST

బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో దేశ సంక్షేమానికే దిక్సూచి. బీఆర్ఎస్ 1౦౦ సీట్లతో మూడోసారి అధికారంలోకి రాబోతుంది. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోతో వార్ వన్ సైడ్ అయిందని ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ధీమా వ్యక్తం చేశారు.

NRI: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోతో వార్ వన్ సైడే: అశోక్ గౌడ్ దూసరి

-వంద సీట్లు పక్కా

-ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి

లండన్: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో దేశ సంక్షేమానికే దిక్సూచి. బీఆర్ఎస్ 100 సీట్లతో మూడోసారి అధికారంలోకి రాబోతుంది. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోతో వార్ వన్ సైడ్ అయిందని ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ధీమా వ్యక్తం చేశారు. అంతేగాక బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలందరికి ఒక భరోసా, ఒక అండ అని, ఖంఢంతాల్లో ఉన్న తెలంగాణ ప్రవాసులందరు బీఆర్‌ఎస్‌ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోపై హర్షం వక్తం చేశారని అశోక్ గౌడ్ తెలిపారు. ఉద్యమ నాయకులే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. తెలంగాణ ప్రజలకి ఏం కావాలో కేసీఆర్‌కి బాగా తెలుసు అని అన్నారు.

2014, 2018 ఎలక్షన్స్ మేనిఫెస్టోలో ప్రవేశ పెట్టిన అంశాలే కాకుండా తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ఎన్నో కొత్త పథకాలు బీఆర్‌ఎస్‌ పార్టీ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలక్షన్స్ కన్నా తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమన్నారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే రాష్ట్రమంతటా ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తుందని తెలియజేసారు, కెసిఆర్ గారిని 1౦౦ సీట్లతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తుందని, రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో ఉదృతంగా ప్రచారం నిర్వహిస్తుందని అశోక్ తెలిపారు.

Updated Date - 2023-10-17T10:27:36+05:30 IST