NRI: జర్మనీ అమ్మాయి.. భారతీయ కుర్రాడు.. రైల్వే స్టేషన్‌లో మొదలైన పరిచయం పెళ్లిదాకా ఎలా చేరిందంటే..

ABN , First Publish Date - 2023-02-11T19:23:55+05:30 IST

అమ్మాయిదేమో జర్మనీ.. అబ్బాయిదేమో మన ఇండియా.. ఓ రైల్వే స్టేషన్‌లో వారిద్దరికీ పరిచయం. ఆ పరిచయమే చివరకు వారి పెళ్లి బంధంలో ఒక్కటి చేసింది.

NRI: జర్మనీ అమ్మాయి.. భారతీయ కుర్రాడు.. రైల్వే స్టేషన్‌లో మొదలైన పరిచయం పెళ్లిదాకా ఎలా చేరిందంటే..

ఎన్నారై డెస్క్: అమ్మాయిదేమో జర్మనీ(Germany), అబ్బాయిదేమో మన ఇండియా.. ఓ రైల్వే స్టేషన్‌లో వారిద్దరికీ పరిచయం. ఆ పరిచయమే చివరకు వారిని పెళ్లి బంధంలో ఒక్కటి చేసింది. ప్రేమంటే ఇదేరా అనిపించేలా ఉన్న వారి లవ్ స్టోరీ(Love story) ప్రస్తుతం హరియాణా(Haryana) ఆసక్తి రేకెత్తిస్తోంది. సోనీపత్ జిల్లా(Sonepat) ముండ్లానా గ్రామానికి చెందిన సుమిత్ 2020లో పైచదువుల కోసం జర్మనీ వెళ్లాడు. ఆ మరుసటి ఏడాది అక్కడి ఓ రైల్వే స్టేషన్‌లో అతడికి ఓ జర్మనీ యువతి పరిచయమైంది. ఆమె పేరు పియామ్లినా . ఆమెకు భారతీయ సంస్కృతి అంటే మక్కువ. దీంతో.. వారి మధ్య పరిచయం స్నేహంగా మారింది.

అయితే.. పియామ్లినా చదువుల కోసం రష్యా వెల్లడంతో సుమిత్‌తో వాట్సాప్ ద్వారా టచ్‌లో ఉండేవారు. ఇండియా అంటే ఎంతో ఇష్టపడే పియామ్లియా ఓమారు భారత్‌కు వచ్చింది. సుమిత్ కుటుంబసభ్యులనూ కలుసుకుంది. వారికి ఆమె ఎంతో నచ్చింది. ఈ క్రమంలో ఆమె రెండో మారు భారత్‌కు వచ్చినప్పుడు వారి వివాహం జరిగింది. వారి ప్రేమకు అంగీకరించిన కుటుంబసభ్యులు నూతన దంపతులు ఆశీర్వదించారు. తొలుత వారు రిజస్టర్ మ్యారేజ్ చేసుకోవడంతో సంప్రదాయబద్దంగా మరోమారు ఆ వేడుక నిర్వహించేందుకు సుమిత్ కుటుంబసభ్యులు ఉవ్విళ్లూరుతున్నారు.

ప్రస్తుతం సుమిత్ పియామ్లినా తమ ప్రాంతంలో ఓ మోస్తరు సెలబ్రిటీలు అయిపోయారు. ముఖ్యంగా పియామ్లినాతో మాట్లాడేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే.. ఆమెకు జర్మన్, ఇంగ్లిష్ భాషలు మాత్రమే వచ్చు. దీంతో.. అప్పుడప్పుడూ సుమిత్ సీన్‌లోకి ఎంట్రీ ఇస్తుంటాడు. భారత సంస్కృతిపై మక్కువే తనను సుమిత్‌కు దగ్గర చేసిందని పియామ్లినా చెబుతుంటుంది.

Updated Date - 2023-02-11T19:26:34+05:30 IST