Kuwait: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ప్రవాసులు దుర్మరణం.. మృతుల్లో ఒకరు భారతీయ వ్యక్తి

ABN , First Publish Date - 2023-01-10T08:10:30+05:30 IST

కువైత్‌లో (Kuwait) సోమవారం రాత్రివేళ ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది.

Kuwait: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ప్రవాసులు దుర్మరణం.. మృతుల్లో ఒకరు భారతీయ వ్యక్తి

కువైత్ సిటీ: కువైత్‌లో (Kuwait) సోమవారం రాత్రివేళ ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సాల్మియా (Salmiya) ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రవాసులు (Expats) మృతిచెందారు. చనిపోయిన వారిలో ఓ భారత వ్యక్తి (Indian) ఉన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కువైత్‌లోని సాల్మియా ప్రాంతం పరిధిలోని బల్జాత్ స్ట్రీట్‌లో సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు రోడ్డు దాటుతున్న నలుగురు ప్రవాసులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వలసదారులు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఈజిప్టియన్, జోర్డానియన్, ఆఫ్రికన్ పౌరుడితో పాటు ఓ భారత వ్యక్తి ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరికొందరు పాదాచారులు సైతం ఈ దుర్ఘటనలో గాయపడినట్లు సమాచారం. కాగా, కారు నడుపుతున్న వ్యక్తిని కువైత్ పౌరుడిగా గుర్తించారు. అతడికి కూడా తీవ్రగాయాలు కావడంతో చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, మృతుల పూర్తి వివరాలను అధికారులు వెల్లడించలేదు. ఈ ఘటనపై కువైత్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-01-10T08:10:33+05:30 IST