Dubai King: వారికి 112 కోట్ల రూపాయల ఆర్థిక సాయం.. దుబాయి రాజు సంచలన ప్రకటన..!

ABN , First Publish Date - 2023-02-07T20:43:32+05:30 IST

దుబాయి రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. సిరియాలో భూకంపబాధితుల సహాయార్థం 13.6 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

Dubai King: వారికి 112 కోట్ల రూపాయల ఆర్థిక సాయం.. దుబాయి రాజు సంచలన ప్రకటన..!

ఎన్నారై డెస్క్: దుబాయి రాజు(Dubai Ruler) షేక్ మహ్మద్ బిన్ రషీద్(Sheik Mohammed Bin Rashid) తాజాగా సంచలన ప్రకటన చేశారు. సిరియాలో భూకంపబాధితుల సహాయార్థం(Humanitarian Aid) 13.6 మిలియన్ డాలర్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాజు సేవా కార్యక్రమాలను పర్యవేక్షించే మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ గ్లోబల్ ఇనీషియేటివ్స్ సంస్థ(Mohammed bin Rashid Al Maktoum global Initiatives) ఆధ్వర్యంలో ఈ నిధులను భూకంపబాధితుల సహాయార్థం వెచ్చించనున్నట్టు డబ్ల్యూఏఎమ్ వార్తా సంస్థ తాజాగా పేర్కొంది.

సోమవారం సంభవించిన భారీ భూకంపం.. సిరియా(Syria), తుర్కియే దేశాల్లో (Turkey) బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రత ఉన్న ఈ భూకంపం..వేల మందిని పొట్టనపెట్టుకుంది. మంగళవారం నాటికి మృతుల సంఖ్య 4 వేలు దాటింది. తెల్లవారు జామున భూకంపం సంభవించడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా. టర్కీలో కహ్రమన్మరాస్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. టర్కీకి సుదూరాన ఉన్న ఈజిప్ట్‌ రాజధాని కైరోలోనూ భూమి కొద్దిగా కంపించింది. ఆ తరువాత కూడా 7.4 తీవ్రత కలిగిన మరో భూప్రకంపనతో అక్కడ కల్లోలం రేగింది.

2.jpgఈ క్లిష్ట సమయంలో అనేక దేశాలు టర్కీ, సిరియాలకు అండగా నిలుస్తున్నాయి. ఆర్థికసాయంతో పాటూ మెడికల్ సిబ్బంది, వైద్య పరికరాలు, ఔషధాలు, విపత్తు నిర్వహణ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక బృందాలు గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా శ్రమిస్తున్నాయి. కాగా.. భూకంపం కారణంగా 13.5 మిలియన్ల మంది ప్రభావితమయ్యారని టర్కీ అధికారులు పేర్కొన్నారు. బాధితులను కాపాడేందుకు మరింతగా శ్రమించాలని, ఇది కాలంతో పందెం వేయడమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్ వ్యాఖ్యానించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడే అవకాశం క్షణక్షణానికీ తగ్గిపోతోందని వ్యాఖ్యానించారు. ఈ ఉపద్రవం నుంచి ప్రాణాలతో బయటపడ్డ 3.80 లక్షల మందిని ప్రభుత్వ కేంద్రాలకు తరలించామని ఉపాధ్యక్షుడు ఫువాత్ ఓక్టే పేర్కొన్నారు.

Updated Date - 2023-02-07T20:43:33+05:30 IST