NRI: ఇళ్లు అద్దెకివ్వకుండా భారత సంతతి వ్యక్తిపై బ్రిటన్‌లో 10 ఏళ్ల పాటు నిషేధం!

ABN , First Publish Date - 2023-10-08T22:20:31+05:30 IST

బ్రిటన్‌ అద్దె ఇళ్లకు సంబంధించిన నిబంధనలు బేఖాతరు చేసినందుకు ఓ భారత సంతతి వ్యక్తిని పదేళ్ల పాటు మరెవ్వరికీ తన ప్రాపర్టీ అద్దెకు ఇవ్వకూడదనంటూ స్థానిక ప్రభుత్వం తాజాగా ఆదేశించింది.

NRI: ఇళ్లు అద్దెకివ్వకుండా భారత సంతతి వ్యక్తిపై బ్రిటన్‌లో 10 ఏళ్ల పాటు నిషేధం!

ఎన్నారై డెస్క్: బ్రిటన్‌(UK) అద్దె ఇళ్లకు సంబంధించిన నిబంధనలు బేఖాతరు చేసినందుకు ఓ భారత సంతతి వ్యక్తిని పదేళ్ల పాటు(10 year ban) మరెవ్వరికీ తన ప్రాపర్టీ అద్దెకు ఇవ్వకూడదనంటూ స్థానిక ప్రభుత్వం తాజాగా ఆదేశించింది(Indian Origin Landlord banned from Letting Out dangerous Homes). నిబంధనలు ఉల్లంఘించే ఇంటి యజమానుల జాబితాలో నీలేందు దాస్‌ను చేర్చుతూ ఉత్తర ఇంగ్లండ్‌లో షెఫీల్డ్ ప్రాంత స్థానిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో ఈ స్థాయిలో నిషేధం విధించడం ఇదే తొలిసారని తెలుస్తోంది.

Indians in Israel: ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులు ఎంతమందంటే..!

నిర్వహణ సరిగా లేని తన ఇళ్లు, ఇతర ప్రాపర్టీలను నీలేందు ఇతరులకు అద్దెకు ఇచ్చేవాడు. అద్దెకుండే వారికి ప్రమాదకంగా మారిన ఈ ఇళ్ల విషయంలో నీలేందు తీరును స్థానిక ప్రభుత్వం పలుమార్లు ఖండించింది. అతడిని తీరు మార్చుకోమంటూ హెచ్చరించింది. కానీ, నీలేందులో మార్పు లేకపోవడంతో ఈ నిషేధం విధించినట్టు పేర్కొంది. సిటీ కౌన్సిల్ సభ్యులు చూసిన అత్యంత ప్రమాదకర నివాస సముదాయాల్లో అతడివి ఉన్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.


Viral: స్నేహితుడికి రూ.2 వేలు బదిలీ చేశాక షాకింగ్ మెసేజ్.. అకౌంట్లో ఏకంగా రూ.753 కోట్లు జమ

ఇక నిబంధనలు ఉల్లంఘించే యజమానుల జాబితా.. బ్రిటన్‌లోని అన్ని దర్యాప్తు సంస్థలకూ అందుబాటులో ఉంటుంది. ఈ నేపత్యంలో నీలేందు మరోసారి చట్టాన్ని అతిక్రమించినట్టు తేలితే అతడికి జైలు శిక్ష లేదా 30 వేల పౌండ్ల వరకూ జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.

Metro: ప్రయాణికుడికి ఊహించని షాకిచ్చిన మెట్రో! అతడు చేసిన తప్పేంటంటే..

Viral: లాటరీ టిక్కెట్ ఏజెంట్‌కు ఊహించని సర్‌ప్రైజ్.. అన్నీ అమ్ముడుపోగా చివర్లో మిగిలిన ఒకే ఒక టిక్కెట్‌తో...

Updated Date - 2023-10-08T22:25:02+05:30 IST