Indians in Israel: ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులు ఎంతమందంటే..!

ABN , First Publish Date - 2023-10-08T22:00:05+05:30 IST

యుద్ధంతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్‌లో దాదాపు 18 వేల మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో అధిగశాతం వృద్ధులకు సేవలందించే కేర్ గివర్స్, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులేనని సమాచారం.

Indians in Israel: ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులు ఎంతమందంటే..!

ఎన్నారై డెస్క్: పాలస్తీనా ఉగ్రసంస్థ హమాస్ దాడులతో ఇజ్రాయెల్ అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులకు దిగిపోయింది. రెండువైపులా కలిపి ఇప్పటివరకూ మొత్తం వెయ్యి మందికి పైగా మరణించి ఉంటారని అంచనా. మరోవైపు, ఈ యుద్ధం కారణంగా వివిధ దేశాల వారు ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయారు. సొంత దేశాలకు ఎలా వెళ్లాలో తెలీక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే, ప్రస్తుతం 18 వేల మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయినట్టు జాతీయ మీడియా చెబుతోంది(18,000 Indians Stuck In Israel).

Viral: స్కూటీపై వెళుతూ కింద పడ్డ యువతులు..సాయం చేస్తానంటూ వచ్చి ఓ అపరిచితుడు చేసిన పనికి..

భారతీయ పౌరుల్లో అధిక శాతం అక్కడి వృద్ధులకు సేవలందించేవారు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు. అక్కడి వృద్ధులకు సేవచేసేందుకు అనేక ఇజ్రాయెల్ సంస్థలు భారత్ నుంచి కేర్ గివర్స్‌ను నియమించుకుంటాయి. మరోవైపు, అక్కడున్న భారత సంతతి యూదులు సంఖ్య దాదాపు 85 వేలని సమాచారం.

Viral Video: వామ్మో.. పాకిస్థానీలు ఇలా ఆలోచిస్తారా? భారతీయుల్లో ఆశ్చర్యం!


ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని భారతీయ విద్యార్థులు కొందరు తెలిపారు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని వాపోయారు. తమ ప్రాంతంలో ప్రస్తుతానికి ఎటువంటి దాడులు జరగట్లేదని మరికొందరు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే అక్కడి నగరాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని మరికొందరు తెలిపారు.

Viral: లాటరీ టిక్కెట్ ఏజెంట్‌కు ఊహించని సర్‌ప్రైజ్.. అన్నీ అమ్ముడుపోగా చివర్లో మిగిలిన ఒకే ఒక టిక్కెట్‌తో...

పరిశీలకుల ప్రకారం 1950-60లల్లో భారత్‌ నుంచి ఇజ్రాయెల్‌‌కు వలసలు ప్రారంభమయ్యాయి. ఈ మధ్యకాలంలో మిజోరం, మణిపూర్‌ రాష్ట్రాలకు చెందిన కొందరు యూదులు కూడా ఇజ్రాయెల్‌కు వలస వెళ్లారు. కాగా, ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులందరినీ సురక్షితంగా ఇండియాకు తీసుకొస్తామని కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖీ తెలిపారు. ఈ వ్యవహారాలను ప్రధాని కార్యాలయం స్వయంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు.

Metro: ప్రయాణికుడికి ఊహించని షాకిచ్చిన మెట్రో! అతడు చేసిన తప్పేంటంటే..

Updated Date - 2023-10-08T22:29:39+05:30 IST