Share News

Winter: శీతాకాలంలో వచ్చే జబ్బులు ఎన్నో.. వీటి నుంచి తప్పించుకోవాలంటే మాత్రం..!!

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:57 PM

ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం ముఖ్యం.

Winter: శీతాకాలంలో వచ్చే జబ్బులు ఎన్నో.. వీటి నుంచి తప్పించుకోవాలంటే మాత్రం..!!
Winter begins

శీతాకాలంలో చాలా వరకూ అనారోగ్యాలు ప్రభలే సమస్య ఎక్కువగా ఉంటుంది. శీతాకాలం పిల్లల్లో పెద్దల్లో సాధారణంగా కనిపించే అనారోగ్య సమస్యలు వాటి నివారణల గురించి తెలుసుకుందాం. శీతాకాల ప్రభావం ప్రస్తుతం కాస్త ఎక్కువగానే ఉంది. చల్లని ఉష్ణోగ్రతల కారణంగా చాలా మందిలో చాలా రకాల అనారోగ్య సమస్యలు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో సాధారణ అనారోగ్యాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. ఆ సులభమైన ప్రభావవంతమైన మార్గాలేమిటంటే..

జలుబు, ఫ్లూ కి కారణమయ్యే సూక్ష్మక్రిములు చేతులకు పట్టి ఉండకుండా ఉండేందుకు చేతులను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

1. సాధారణంగా శీతాకాలం వచ్చే అనేక రకాల వ్యాధులకు రోగ నిరోధక శక్తి సరిగా లేకపోవడమే.. దీనిని పెంచడానికి ముఖ్యంగా ఫ్లూ కోసం టీకాలను వేయించుకోవాలి.

2. వెచ్చగా ఉండేందుకు శ్వాసకోస ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు వెచ్చని దుస్తులు ధరించడం ముఖ్యం.

3. శరీరాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచడానికి సిద్ధంకండి.

ఇది కూడా చదవండి: నిద్రకు సరైన సమయాన్ని కేటాయించకపోతే ఇన్ని సమస్యలా.. !!


4. ఈ కాలంలో దాహం అనిపించకపోయినా ఎక్కువ నీటిని తీసుకోవాలి. ఇది ఈ కాలంలో వచ్చే అనారోగ్యాలను ఎదుర్కొనేందుకు సహకరిస్తుంది.

5. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం ముఖ్యం. విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని సమతుల్య ఆహారంగా తీసుకోవాలి.

6. క్రిమిలు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి దగ్గినపుడు, తుమ్మినపుడు నోరు, ముక్కుకు చేతిని అలవాటు పెట్టుతోవాలి.

7. మొత్తం ఆరోగ్యానికి పుర్తి ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తిని శరీరానికి అందించాలంటే మాత్రం శరీరక శ్రమను అందించాలి.

8. ఇలాంటి లక్షణాలను కనుక అనుభవిస్తూంటే మాత్రం వెంటనే డాక్టర్ సంపదించడం మేలు.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 18 , 2023 | 12:57 PM