Share News

Health Tips: దగ్గు, జలుబు వంటివి చలికాలంలో అస్సలు రాకుండా ఉండాలంటే.. ఈ చిన్న పని చేయండి చాలు..!

ABN , First Publish Date - 2023-11-29T17:12:10+05:30 IST

సిట్రస్ పండ్లు రసం.. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Health Tips: దగ్గు, జలుబు వంటివి చలికాలంలో అస్సలు రాకుండా ఉండాలంటే.. ఈ చిన్న పని చేయండి చాలు..!
6 juices

కాలం మారుతున్న కొద్దీ దానికి తగిన విధంగా ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఉండాలి. చలికాలం అయినా, వేసవి అయినా, మరే కాలం అయినా ఆహారంలో మార్పు వల్ల శరీరానికి కావలసిన శక్తిని అందుకోవచ్చు. అయితే ఇందులో మరీ ముఖ్యంగా జ్యూస్‌ల గురించి తెలుసుకోవాలంటే.. శీతాకాలంలో జ్యూస్‌లను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అంటారు. అసలు శీతాకాలంలో ఎలాంటి జ్యూస్‌లను తాగాలి. శీతాకాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వేడిగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. రసాలను తాగాలి. లేదంటే శరీరానికి మేలు చేసేకంటే కీడు జరగడమే ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఫిట్ గా ఉండాలంటే, ఈ ఆరురకాల జ్యూస్ తప్పక తాగాలట అవేంటో చూద్దాం.

బీట్ రూట్ జ్యూస్..

చలికాలంలో బీట్ రూట్ జ్యూస్ రుచిగా ఉండటమే కాదు. ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇందులో అల్లం కలిపి తాగితే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, నైట్రేట్లు, విటమిన్లు, మినరల్స్ శరీరానికి అందుతాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. క్యాన్సర్ కణాలను పెరుగుదలను తగ్గిస్తుంది. ప్రతిరోజూ బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం అలసటను తగ్గిస్తుంది.

క్యారెట్, అల్లం

క్యారెట్, అల్లం రసం తాగడం వల్ల విటమిన్ ఎ, సి లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది మన చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అల్లరసంలో ఉండే జింజెరాల్ క్యాన్సర్ కణాల తగ్గుదలను ప్రోత్సాహిస్తుంది.

సిట్రస్ పండ్లు రసం..

విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు, జలుబు ఫ్లూ నుండి రక్షిస్తుంది. ఇందులో ఫ్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇందులోని విటమివ్ సి ఉండటం వ్లల చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

ఇది కూడా చదవండి: చేపలతో కలిపి పొరపాటున కూడా తినకూడని 6 ఆహార పదార్థాల లిస్ట్ ఇదీ.. తింటే ఏమౌతుందంటే..!


క్రాన్బెర్రీ జ్యూస్..

ఈ రసం యాంటీ ఆక్సిడెంట్లను అందించి, జీర్ణశక్తిని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్రాన్బెర్రీ జ్యూస్ లో, విటమిన్ సి, ఇ ఉంటాయి. ఇవి మూత్రనాళాల ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. క్రాన్ బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చట.

కివి రసం..

కివిలో కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్ ఉండటం వల్ల జలుబు, ఫ్లూ నుండి రక్షణ కలుగుతుంది. ఇందులోని విటమిన్ సి చర్మంలో ముడతలను తగ్గించి, చర్మ కాంతినిస్తుంది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-29T17:12:11+05:30 IST