Drinking Water: పొద్దున్నే నిద్ర లేవగానే నీళ్లు తాగే అలవాటుందా..? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివీ..!
ABN , First Publish Date - 2023-12-06T13:56:59+05:30 IST
రాత్రంతా నిద్ర పోవడం వలన చాలా గంటల పాటు నీరు అందకుండా పోతుంది. ఇలా తాగితే శరీరంలో నీటి కొరత ఉంటుంది.
ఉదయాన్నే నీళ్ళు తాగితే, మరికొంతమంది మాత్రమే వేడి నీళ్ళను తాగుతారు. ఉదయం పూట నీరు తాగడం అనేది పూర్వకాలం నుంచి వస్తున్నదే.. ఇలా చేయడం వల్ల కడుపులో కదలికలు బావుండి, అధిక బరువును తగ్గించుకోవచ్చు. జీవక్రియకు కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది.
రాత్రంతా నిద్ర పోవడం వలన చాలా గంటల పాటు నీరు అందకుండా పోతుంది. ఇలా తాగితే శరీరంలో నీటి కొరత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ నిద్రలేవగానే నీరు తాగడానికి కారణం ఇదే. అలాగే చర్మం డల్ గా మారినట్లు అనిపిస్తే నిద్రలేచిన వెంటనే నీరు తాగాలి. ఇది చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అంతేకాదు కిడ్నీలో రాళ్ళు ఏర్పడే సమస్య నుంచి కూడా రక్షిస్తుంది. శరీరంలో పేరుకునే విష పదార్థాలను బయటకు పంపడంలో కూడా నీరు సహకరిస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. సమంగా నీరు తీసుకునే వ్యక్తుల్లో అనారోగ్య సమస్యను తగ్గిస్తుంది. మలబద్దకం, జీర్ణ సమస్యలకు నీరు చక్కని పరిష్కారం.
ఇది కూడా చదవండి: బరువు పెరుగుతున్నారని డౌట్ వచ్చిందా..? అస్సలు ఆలస్యం చేయకుండా ఈ 5 పనులనూ చేస్తే..!
1. ఉదయాన్నే నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.
2. అధిక బరువు తగ్గుతారు.
3. నోటి దుర్వాసన తగ్గుతుంది.
4. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది.