Weight Gain: బరువు పెరుగుతున్నారని డౌట్ వచ్చిందా..? అస్సలు ఆలస్యం చేయకుండా ఈ 5 పనులనూ చేస్తే..!
ABN , First Publish Date - 2023-12-05T15:55:58+05:30 IST
పూర్తిగా నిద్రపోవడం చాలా ముఖ్యం, నిద్రకోసం కష్టపడుతూ ఉండటం వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది.
శీతాకాలం వచ్చిందంటే శరీరంలో బద్దకంగా అనిపిస్తుంది. తరచుగా ఎండలో కూర్చొని వేరుశెనగ తినడం, కొన్నిసార్లు సరైన సమయంలో ఎలాంటి వ్యాయామం చేయాలి..ఎటువంటి వ్యాయామం లేకుండా లేకపోవడం వల్ల, శరీర బరువు పెరగడం మొదలవుతుంది. బరువును అదుపులో ఉంచుకోవడం.. శరీరం బరువు పెరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే..
మంచి నీరు..
చలికాలంలో దాహం తక్కువగా ఉంటుంది. కాబట్టి చాలావరకూ ఈ కాలంలో నీటిని తక్కువగా తీసుకుంటూ ఉంటారు. తక్కువగా నీరు తాగితే తిరిగి బరువు పెరిగే అవకాశం చాలా వరకూ తగ్గుతుంది. వేడి వేడి టీ తాగే బదులుగా జ్యూస్ లు, నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు త్రాగడం బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
వేడి నీటిని తీసుకోవడం..
బరువు తగ్గడానికి వేడి నీటిని తాగడం కొంత వరకూ సపోర్ట్ చేస్తుంది. ప్రతి ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు.
గంట పాటు నడక అవసరం.
పగటి పూట సమయం చిక్కకక పోతే రాత్రి పూట అయినా సరే.. రాత్రి పూట సమయం దొరక్కపోయినా సమయం దొరికినప్పుడే గంట సేపు నడవడం ల్ల బరువును అదుపులో ఉంచవచ్చు.
ఇది కూడా చదవండి: ఈ తెల్లటి నువ్వుల్ని రోజూ కాసిన్ని తినండి చాలు.. కొవ్వు దానంతట అదే కరిగిపోవడం ఖాయం..!
సరైన నిద్ర..
నిద్ర సరిగా లేకపోయినా బరువు పెరుగుతారు. పూర్తిగా నిద్రపోవడం చాలా ముఖ్యం, నిద్రకోసం కష్టపడుతూ ఉండటం వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది.
చక్కెర పదార్థాలు..
శీతాకాలంలో స్వీట్స్ తినడం నోటికి రుచిగానే అనిపించినా, పరిమితంగా తినకపోతే మాత్రం చక్కెర వ్యాధి అధిక బరువు వల్ల వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.