Coffee Causes Acne : కాఫీ జీవక్రియను పెంచుతుంది. శక్తినిస్తుంది. అయితే కాఫీ వల్ల మొటిమలు వస్తాయా?

ABN , First Publish Date - 2023-01-23T15:11:23+05:30 IST

కాఫీ జీవక్రియను పెంచుతుంది.. అలాగే చర్మానికి హాని కలిగించవచ్చు కూడా.

Coffee Causes Acne : కాఫీ జీవక్రియను పెంచుతుంది. శక్తినిస్తుంది. అయితే కాఫీ వల్ల మొటిమలు వస్తాయా?
better skin

కాఫీతో ఉదయాన్ని మొదలుపెట్టేవారు చాలామందే ఉంటారు. కాఫీ తాగనిదే ఉదయం ప్రశాంతంగా మొదలవదనేది అంతా అనుకునేమాటే.. అయితే ఇంత ఇష్టంగా తాగుతున్న కాఫీ చాలాసార్లు చేటు తెచ్చిపెడుతుంది. కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక అవాంఛనీయమైన వైద్య రుగ్మతలు ఏర్పడతాయట.. మీ ఛాయపై ప్రభావం చూపుతుంది. కాఫీ జీవక్రియను పెంచుతుందని అలాగే చర్మానికి హాని కలిగించవచ్చు.

కాఫీ మొటిమలను తెచ్చిపెడుతుందనేది డాక్టర్స్ అంటున్నమాట. కాఫీ నేరుగా చర్మంపై మొటిమలను సృష్టించదు; కానీ, తీసుకునే ఆహారం, కాఫీలోని కెఫెన్ కలగలిపి మోటిమలను పెంచుతాయట. కాఫీ తాగడం వల్ల మొటిమలు పెరుగుతాయా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించడానికి ఎటువంటి అధ్యయనాలు లేవు., అయితే పరిగణనలోకి తీసుకోవలసిన కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి.

కెఫీన్ కలిగిన కాఫీలోని పదార్థాలైన పాలు, చక్కెర, మొటిమలకు కారణాలు కావచ్చు. ఈ రెండు, చర్మాన్ని మరింతగా విరిగిపోయేలా చేస్తాయి, కాఫీలో కెఫిన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కెఫీన్ శరీరంలో ఒత్తిడిని పెంచుతుంది. మొటిమలు ఒత్తిడి వల్ల వస్తాయి.

Updated Date - 2023-01-23T15:13:22+05:30 IST