Share News

Acai berries: బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్‌లానే ఎకాయ్ బెర్రీస్ కూడా మెదడు ఆరోగ్యానికి సూపర్‌ఫుడ్.. వీటిని తీసుకుంటే..!!

ABN , Publish Date - Dec 31 , 2023 | 01:11 PM

బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ గురించి వింటూనే ఉన్నాం. , అయితే ఎకై బెర్రీలు అంటే ఏమిటి? ఎకాయ్ బెర్రీలు దక్షిణ అమెరికాలోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌కు చెందిన ఎకాయ్ తాటి చెట్ల నుండి సేకరిస్తారు.. అవి నీలం-ఊదా రంగులో ఉంటాయి.పెద్ద బ్లూబెర్రీస్ మాదిరిగానే పరిమాణం, ఆకారాన్ని ఉన్నా కూడా వీటి రుచి వాటితో పోల్చితే భిన్నంగా ఉంటుంది.

Acai berries: బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్‌లానే ఎకాయ్ బెర్రీస్ కూడా మెదడు ఆరోగ్యానికి సూపర్‌ఫుడ్.. వీటిని తీసుకుంటే..!!
Acai berries

బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ గురించి వింటూనే ఉన్నాం. , అయితే ఎకై బెర్రీలు అంటే ఏమిటి? ఎకాయ్ బెర్రీలు దక్షిణ అమెరికాలోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌కు చెందిన ఎకాయ్ తాటి చెట్ల నుండి సేకరిస్తారు.. అవి నీలం-ఊదా రంగులో ఉంటాయి.పెద్ద బ్లూబెర్రీస్ మాదిరిగానే పరిమాణం, ఆకారాన్ని ఉన్నా కూడా వీటి రుచి వాటితో పోల్చితే భిన్నంగా ఉంటుంది. ఈ బెర్రీస్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఇవి "సూపర్‌ఫుడ్" గా తీసుకుంటారు. ఈ ఎకై బెర్రీస్‌తో కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం..

ఎకాయ్ బెర్రీస్ ప్రయోజనాలు ఏమిటి?

అకాయ్ బెర్రీలు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలతో నిండి ఉన్నాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటాయి. ఇందులో తక్కువ చక్కెర కంటెంట్‌తో పాటు అనేక ఖనిజాలు, ఆంథోసైనిన్స్ వంటి సమ్మేళనాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

1. యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.

అకాయ్ బెర్రీలు వాటి అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి.

ఈ ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీస్తాయి. మన శరీరంలో వ్యాధులకు కారణమవుతాయి. "యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంతో సహా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.

2. చర్మానికి మంచిది.

ఎకాయ్ బెర్రీలలోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మ మృదుత్వాన్ని కాపాడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడం ద్వారా వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి.

ఇది కూడా చదవండి: నీటిని ఎప్పుడు తాగాలి.. ఎప్పుడు తాగకూడదు...!


3. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

అకాయ్ బెర్రీలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. వాటి ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్ల కారణంగా మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

4. బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది.

ఎకై బెర్రీ సప్లిమెంట్‌లు కొన్నిసార్లు బరువు తగ్గడం సహాయపడతాయని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి.

5. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అల్జీమర్స్ వ్యాధి, పార్కిన్సన్స్ వ్యాధి వంటి మెదడు వ్యాధులు ఎక్కువగా వృద్ధాప్యం కారణంగా వస్తాయి. వాటికి చికిత్స లేదు. అయినప్పటికీ, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు అధికంగా ఉండే కొన్ని ఆహారాలు ఇటువంటి వ్యాధుల ప్రమాదాన్ని అదుపులో ఉంచుతాయి. అకాయ్ బెర్రీస్‌లో పుష్కలంగా లభించే ఆంథోసైనిన్, ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Dec 31 , 2023 | 01:12 PM