Share News

Foods: ఈ 8 సూపర్ ఫుడ్స్ తో మీ కాలేయ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు..!!

ABN , Publish Date - Dec 31 , 2023 | 03:39 PM

రోజు రోజుకూ పెరుగుతున్న కాలేయం సమస్యలతో పోరాడుతున్న వారిసంకంయ 38% వరకూ ఉంది. శరీరంలోని అత్యంత విలువైన అవయవాన్ని కాపాడుకోవడం కీలకం. జీవక్రియ ఇంకా ఎన్నో ఇతర విధుల్లో పాల్గొంటుంది.

Foods: ఈ 8 సూపర్ ఫుడ్స్ తో మీ కాలేయ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు..!!
superfoods,

రోజు రోజుకూ పెరుగుతున్న కాలేయం సమస్యలతో పోరాడుతున్న వారిసంకంయ 38% వరకూ ఉంది. శరీరంలోని అత్యంత విలువైన అవయవాన్ని కాపాడుకోవడం కీలకం. జీవక్రియ ఇంకా ఎన్నో ఇతర విధుల్లో పాల్గొంటుంది. దీని సంరక్షణకు పోషకాహార పదార్థాలను తీసుకుంటే కాలేయం ఆరోగ్యంలో అద్బుతాలను చూడవచ్చు. కాలేయ ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే 8 సూపర్ ఫుడ్స్ ఇవే.. వీటి గురించి తెలుసుకుందాం.

కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి సూపర్ ఫుడ్స్..

పసుపు...

పసుపు యాంటీబయాటిక్ గా పని చేస్తుంది. ఇందులోని కర్కుమిన్ వల్ల పసుపు స్పష్టమైన రంగు కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. పసుపును క్రమం తప్పకుండా తీసుకుంటే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పసుపును ఆహారంలో కలుపుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యంలో పెద్ద ఆరోగ్యకరమైన మార్పు వస్తుంది.

గ్రీన్ టీ..

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కంలంగా ఉంటాయి. గ్రీన్ టీలోని అధిక కాటెచిన కంటెంట్ కారణంగా కాలేయ ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది. ఈయాంటీ ఆక్సిడెంట్లు కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోజూ గ్రీన్ తీసుకోవడం మంచిది.

సిట్రిస్ పండ్లు..

ద్రాక్ష, నిమ్మ, నారింజ, ఆరెంజ్, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

క్రూసిఫరస్ కూరలు...

ఆరోగ్యాన్ని సరైన విధంగా కాపాడే కూరలలో ముఖ్యంగా క్రూసిఫరస్ కూరలు ప్రధానమైనవి. ఇందులో కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటంలో బ్రోకలి, బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ ఉన్నాయి. గ్లూకోసినోలైట్స్ లో పుష్కలంగా ఉండే పోషకాలు కాలేయ ఎంజైమ్‌లను ఎదుర్కొంటాయి. మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

ఇది కూడా చదవండి: విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కోవిడ్-19 తీవ్రత తగ్గుతుందా?


కొవ్వు చేపలు.. ఒమేగా -3

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల ప్రయోజనాలున్నాయి. ఈ ముఖ్యమైన కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా కాలేయాన్ని కూడా కాపాడుతాయి.

రక్త ప్రసరణ

పెరిగిన రక్త ప్రసరణ నుండి ప్రయోజనం పొందడానికి నైట్రేట్లు సమృద్ధిగా ఉండే దుంపలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అంతకు మించి, దుంపలలో ఉండే బీటైన్ అనే పదార్ధం కాలేయానికి మద్దతు ఇస్తుంది. దుంపలు సలాడ్‌లు, స్మూతీస్‌లకు కలిపితే మంచి రుచికరమైన సైడ్ డిష్‌గా కాలేయం ఆరోగ్యాన్ని పెంచే విధంగా ఉంటుంది.

ఆలివ్ ఆయిల్

లిక్విడ్ గోల్డ్ అని కూడా పిలిచే పచ్చి ఆలివ్ నూనె వంటలో ఉపయోగించడం వల్ల యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల సమృద్ధిగా సరఫరా అవుతాయి. ఇవి కాలేయం వాపు, ఒత్తిడి నుండి కాపాడతాయి.

వాల్‌నట్‌లు

వాల్‌నట్‌ల ఆరోగ్యకరమైన కాలేయం కోసం సహకరిస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. వాల్‌నట్స్ మంటను తగ్గించడానికి కాలేయం పనితీరుకు సహాయపడతాయి. ప్రతిరోజూ కొన్ని వాల్‌నట్‌లను తినడం వల్ల కాలేయ ఆరోగ్యవంతంగా ఉంటుంది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Dec 31 , 2023 | 03:39 PM