Ashwagandha: ఈ మూలికతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..!

ABN , First Publish Date - 2023-01-11T12:53:56+05:30 IST

పిల్లలకు, పెద్దలకు అశ్వగంధ మంచి ఔషధం.

Ashwagandha: ఈ మూలికతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..!
Ashwagandha

ఆయుర్వేదంలో అశ్వగంధను ఒక శక్తివంతమైన మూలికగా వాడుతున్నాం, ఇది వ్యాధులను నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శాస్త్రీయంగా, దీనిని వితనియా సోమ్నిఫెరా అని పిలుస్తారు. ఇది శరీరం ప్రతిస్పందించడానికి, ఒత్తిడికి అనుగుణంగా సహాయపడే పదార్ధం. సాంప్రదాయ భారతీయ ఆయుర్వేద ఔషధంగా యుగాలుగా ఉపయోగించబడుతోంది. నొప్పి, వాపును తగ్గించడమే కాకుండా నిద్రలేమికి చికిత్స చేయడంలో మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది.

అశ్వగంధ ప్రయోజనాలు ఇవి.

మెరుగైన నిద్ర..

చాలా మంది ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం అశ్వగంధ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది మంచి నిద్రకు దారితీస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. అశ్వగంధ మెదడు పనితీరును మెరుగుపరిచే ప్రత్యేక పదార్ధాలను కలిగి ఉంటుంది. బద్ధకం, జ్ఞాపకశక్తి లోపాన్ని తొలగిస్తుంది.

అశ్వగంధలో అడాప్టోజెన్లు ఉన్నాయి, ఇది శరీరం ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. హీట్ షాక్ ప్రోటీన్ (Hsp70), కార్టిసాల్, స్ట్రెస్-యాక్టివేటెడ్ సి-జూన్ ఎన్-టెర్మినల్ ప్రోటీన్ కినేస్ (JNK-1)లను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. కాన్సర్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. రక్తపోటు , మధుమేహ వ్యాధుల నియంత్రణలో సహకరిస్తుంది. ఇది ఒత్తిడి అడ్రినోకోర్టికోట్రోపిక్ హార్మోన్ (ఎసిటిహెచ్) స్రావాన్ని పెంచుతుంది, శరీరంలో కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది.

గుండె ఆరోగ్యానికి, జీర్ణ ఆరోగ్యానికి..

పిల్లలకు, పెద్దలకు అశ్వగంధ మంచి ఔషధం. మెదడులో నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచడం ద్వారా పనిచేస్తుంది, ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. అశ్వగంధలో గుండె ఆరోగ్యానికి, జీర్ణ ఆరోగ్యానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఈ మూలికలో ఉన్న ఔషధ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది

Updated Date - 2023-01-11T12:56:19+05:30 IST