Pee gate Incident: మహిళపై మూత్ర విసర్జన చేసిన టీటీఈని సర్వీసు నుంచి తొలగించిన కేంద్రం

ABN , First Publish Date - 2023-03-14T19:39:48+05:30 IST

అకల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న మహిళలపై ముత్ర విసర్జన చేసిన ట్రావిలింగ్ టికెట్ ఎగ్జామినర్..

Pee gate Incident: మహిళపై మూత్ర విసర్జన చేసిన టీటీఈని సర్వీసు నుంచి తొలగించిన కేంద్రం

న్యూఢిల్లీ: అకల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న మహిళలపై ముత్ర విసర్జన (Pee gate) చేసిన ట్రావిలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) మున్నా కుమార్‌ (Munna kumar)పై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. సర్వీసు నుంచి అతన్ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. ఇలాంటి ఘటనలను ఎంతమాత్రం సహించేది లేదని, సర్వీసు నుంచి తక్షణం ఆయనను తొలిగిస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వేస్ జారీ చేసిన రిమూవల్ లెటర్‌ను ఆయన ట్వీట్ చేశారు.

ఘటన వివరాలు..

అమృత్‌సర్-కోల్‌కతా మధ్య నడిచే అకల్ తఖ్త్‌ ఎక్స్‌ప్రెస్‌లో టీటీఈ తప్పతాగిన మైకంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశారు. ఆదివారంనాడు చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. నిద్రిస్తున్న ప్రయాణికురాలిపై టీటీఈ మూత్రవిసర్జన చేయడంతో ఆమె బిగ్గరగా కేకలు వేసింది. దాంతో ఆమె భర్త రాజేష్ టీటీఈని పట్టుకుని దేహశుద్ధి చేశాడు. అనంతరం రైలు లక్నో చేరుకోగానే టీటీఈని రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితుడిని బీహార్‌కు చెందిన మున్నా కుమార్‌గా గుర్తించారు. తన భార్యపై మూత్రవిసర్జన చేశాడంటూ బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీటీఈని రైల్వై పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

రెండు నెలల క్రితం ఇదే తరహా ఘటన ఒక విమానంలో చోటుచేసుకుంది. తాగిన మైకంలో ఒక వ్యక్తి తన పక్క సీటులో కూర్చున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. నిందితుడు శంకర్ మిశ్రాను అరెస్టు చేసి, నాలుగు నెలల పాటు అతని విమాన ప్రయాణాలపై నిషేధం విధించారు. అనంతరం అమెరికల్ ఎయిర్ లైన్‌లో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడంతో నిందితుడిని ఐజీఐ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు.

Updated Date - 2023-03-14T19:39:48+05:30 IST