Written test: డిసెంబరు 24న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష
ABN , First Publish Date - 2023-11-21T12:34:59+05:30 IST
సహకార సంఘాల్లో ఖాళీగా ఉన్న 2,257 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి డిసెంబ రు 24న రాతపరీక్ష(Written test) నిర్వహించనున్నారు.

పెరంబూర్(చెన్నై): సహకార సంఘాల్లో ఖాళీగా ఉన్న 2,257 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి డిసెంబ రు 24న రాతపరీక్ష(Written test) నిర్వహించనున్నారు. చెన్నైలో అధికంగా 132 పోస్టులు భర్తీ కానున్నాయి. అలాగే, చెంగల్ప ట్టు జిల్లాలో 73, కాంచీపురంలో 43, తిరువళ్లూర్‌లో 74, వేలూరు జిల్లాలో 40 సహా అన్ని జిల్లాల్లో కలపి 2,257 పోస్టులు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులై వృత్తి శిక్షణ చేసిన 18 నుంచి 32 ఏళ్లలోపున్న వారు ఈ పోస్టులకు అర్హులు. కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీలకు వయోపరిమితి వర్తించదు. ఆసక్తి కలిగిన వారు ఆయా జిల్లా సహకార సంఘ వెబ్‌సైట్‌లో డిసెంబరు 1వ తేదిలోపు దరఖాస్తు చేసుకోవాలని సహకార శాఖ ప్రకటించింది.