Tamilnadu: కొత్త జంటకు అదిరిపోయే బహుమతి...

ABN , First Publish Date - 2023-07-13T12:44:56+05:30 IST

చెన్నై: తమిళనాడులో టమోటా, ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడిప్పుడే వాటి ధరలు తగ్గేలా కనిపించడంలేదు. కిలో టమోటా ధర రూ. 100కు పైగానే ఉండగా.. చిన్న ఉల్లిపాయలు కిలో ధర రూ. 2వందలు పలుకుతోంది.

Tamilnadu: కొత్త జంటకు అదిరిపోయే బహుమతి...

చెన్నై: తమిళనాడులో టమోటా, ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడిప్పుడే వాటి ధరలు తగ్గేలా కనిపించడంలేదు. కిలో టమోటా ధర రూ. 100కు పైగానే ఉండగా.. చిన్న ఉల్లిపాయలు కిలో ధర రూ. 2వందలు పలుకుతోంది. ఈ సందర్బంగా తమిళనాడు, కోయంబత్తూరులో నూతన వధూవరులకు టమోటాలు, ఉల్లిపాయలను బహుమతిగా ఇచ్చారు.

కోయంబత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ హాల్లో గణేష్, హేమల రిషిప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు రైతు సంఘం అధ్యక్షుడు పళనిచ్చామి, రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు టమోటాలు బహుమతిగా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు వరుడి స్నేహితులు చిన్న ఉల్లిపాయలను బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2023-07-13T12:44:56+05:30 IST