Delhi court: ఢిల్లీ సాకేత్ కోర్టులో కాల్పుల కలకలం
ABN , First Publish Date - 2023-04-21T11:17:39+05:30 IST
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని సాకేత్ కోర్టులో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది....
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని సాకేత్ కోర్టులో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది.(Delhi court) సాకేత్ కోర్టులో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఓ మహిళ(woman) తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు.కోర్టులో లాయరు దుస్తులతో మారువేషంలో వచ్చిన షూటర్ కాల్పులు జరిపాడు.కోర్టు ఆవరణలో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. మహిళ పరిస్థితి విషమంగా ఉంది మరియు ఎయిమ్స్‌కు తరలించారు.గత ఏడాది రోహిణి కోర్టులో ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు.