Bommai warning: ఎస్కామ్‌లకు తాళాలు వేస్తాం.. సిద్ధూ సర్కార్‌కు బొమ్మై వార్నింగ్

ABN , First Publish Date - 2023-10-11T19:50:29+05:30 IST

రైతులకు మూడు దఫాలుగా ఏడు గంటల నిరంతర విద్యుత్ ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యుత్ సరఫరా కంపెనీల కార్యాలయాలకు భారతీయ జనతా పార్టీ తాళాలు వేస్తుందని సిద్ధరామయ్య సర్కార్‌కు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బుధవారంనాడు హెచ్చరించారు.

Bommai warning: ఎస్కామ్‌లకు తాళాలు వేస్తాం.. సిద్ధూ సర్కార్‌కు బొమ్మై వార్నింగ్

బెంగళూరు: రైతులకు మూడు దఫాలుగా ఏడు గంటల నిరంతర విద్యుత్ ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యుత్ సరఫరా కంపెనీల (ESCOM) కార్యాలయాలకు భారతీయ జనతా పార్టీ (BJP) తాళాలు వేస్తుందని సిద్ధరామయ్య సర్కార్‌కు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) బుధవారంనాడు హెచ్చరించారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన రైతు నిరసన కార్యక్రమంలో బొమ్మై మాట్లాడుతూ, విద్యుత్ సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, అయితే ప్రభుత్వం దీనిని బేఖాతరు చేస్తోందని విమర్శించారు.


రాష్ట్రంలోని గత బీజేపీ ప్రభుత్వం ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌కు రూ.10,000 కోట్లు ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి గ్రాంట్ రిలీజ్ చేయలేదని మాజీ సీఎం చెప్పారు. గ్రాంట్ రిలీజ్ చేసేందుకు కానీ, బొగ్గు కొనుగోలుకు కానీ ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని విమర్శించారు. 1.50 లక్షల ఇరిగేషన్ పంప్ సెట్లు ఉన్నప్పటికీ విద్యుత్ లేకపోవడంతో చిక్కబల్లాపుర జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. గత బీజేపీ ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా అప్పటి విపక్ష ఎమ్మెల్యేలకు కూడా గ్రాంట్స్ ఇచ్చిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతు వ్యతిరేక, జీరో-గ్రాంట్ ప్రభుత్వమని, ఏ అభివృద్ధి ప్రాజెక్టుకు డబ్బులు విడుదల చేయడం లేదని చెప్పారు. విద్యుత్ లేకపోవడంతో లక్షలాది వాటర్ పంపు సెట్లు మూలనపడ్డాయని బొమ్మై తెలిపారు.

Updated Date - 2023-10-11T19:50:29+05:30 IST