Whatsapp Pink App: వాట్సాప్ పింక్ యాప్‌పై అప్రమత్తంగా ఉండాలి..
ABN , First Publish Date - 2023-06-29T12:17:02+05:30 IST
వాట్సాప్ పింక్ యాప్(Whatsapp Pink App)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త అంశాలతో వా
పెరంబూర్(చెన్నై): వాట్సాప్ పింక్ యాప్(Whatsapp Pink App)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త అంశాలతో వాట్సాప్ పింక్ యాప్ అనే విడుదల చేసినట్లు పేర్కొంటూ వినియోగదారులకు మెసేజ్ పంపి నగదు మోసానికి పాల్పడుతున్నట్లు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసిన వెంటనే మీ వాట్సాప్ పింక్ కలర్‌కు మారడంతో పాటు వ్యక్తిగత, బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్ తదితరాలు చోరీ చేసే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు ప్లేస్టోర్, ఆపిల్ ప్లేస్టోర్ తదితర సైట్‌ల నుంచి మాత్రమే యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలని, గుర్తింపులేని వెబ్‌సైట్‌ల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకోరాదని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.