Share News

Supreme Court: మూడేళ్లుగా ఏం చేస్తున్నారు?.. బిల్లులపై ఆర్ఎన్ రవికి సుప్రీం కోర్టు సూటి ప్రశ్న

ABN , First Publish Date - 2023-11-20T13:29:32+05:30 IST

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయడంలో జాప్యంపై తమిళనాడు(Tamilnadu) ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు(Supreme Court) గవర్నర్ ఆర్ ఎన్ రవి(RN Ravi)కి సూటి ప్రశ్న వేసింది. 2020లో అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లుల విషయంలో ఏదో ఒకటి తేల్చకుండా మూడేళ్లుగా ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించింది.

Supreme Court: మూడేళ్లుగా ఏం చేస్తున్నారు?..  బిల్లులపై ఆర్ఎన్ రవికి సుప్రీం కోర్టు సూటి ప్రశ్న

ఢిల్లీ: అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయడంలో జాప్యంపై తమిళనాడు(Tamilnadu) ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు(Supreme Court) గవర్నర్ ఆర్ ఎన్ రవి(RN Ravi)కి సూటి ప్రశ్న వేసింది. 2020లో అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లుల విషయంలో ఏదో ఒకటి తేల్చకుండా మూడేళ్లుగా ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించింది. పంజాబ్, కేరళలలో కూడా గవర్నర్లు ఇలాగే చేస్తున్నారని ఆయా ప్రభుత్వాలు ఆరోపణలు చేస్తున్న క్రమంలో విచారించిన ధర్మాసనం గవర్నర్ల తీరును తప్పుబట్టింది.

ఇటీవల గవర్నర్ల పనితీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఆ తరువాత ఆర్ ఎన్ రవి అసెంబ్లీ ఆమోదం పొంది మూడేళ్లుగా గవర్నర్ ఆమోద ముద్ర కోసం పంపించిన బిల్లుల్ని వెనక్కి పంపారు. గవర్నర్ బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.


ప్రభుత్వం శనివారం మళ్లీ అసెంబ్లీని సమావేశపరిచి పది బిల్లుల్ని ఆమోదించింది. వాటిని గవర్నర్ కి తిప్పి పంపింది. కోర్టు ఈ పరిణామాలన్నీ గమనించి.. అసెంబ్లీ మళ్లీ బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపింది. గవర్నర్ ఏం చేస్తారో చూద్దాం అంటూ విచారణను డిసెంబరు 1కి వాయిదా వేసింది. గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే బిల్లులను ఆలస్యం చేశారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజలతో ఎన్నికైన పాలనను అణగదొక్కడానికి బీజేపీ(BJP) ప్రయత్నిస్తోందని కామెంట్స్ చేసింది. రవి తనకు సమర్పించిన 181 బిల్లుల్లో 162 బిల్లులకు ఆమోదం తెలిపినట్లు కోర్టు పేర్కొంది.

ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు మూడే ఆప్షన్స్ ఉంటాయని.. ఆయన వద్దకు పంపిన బిల్లులకు ఆమోదం తెలపడం.. రిజెక్ట్ చేయడం.. లేదా రాష్ట్రపతికి పంపడం అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నిబంధన ప్రకారం గవర్నర్ పునఃపరిశీలన కోసం బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపవచ్చు అని కోర్టు చెప్పింది. "గవర్నర్ రవి ఇంతకుముందు కూడా చాలా ఆలస్యం తర్వాత నీట్ మినహాయింపు బిల్లును వాపసు చేశారు. అసెంబ్లీ మళ్లీ బిల్లును ఆమోదించిన తర్వాత మాత్రమే దానిని రాష్ట్రపతికి పంపారు. ఆన్‌లైన్ గేమింగ్‌పై నిషేధం కోరుతూ వచ్చిన బిల్లుపై ఆయన ఇదే వైఖరిని అవలంబించారు" అని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా గవర్నర్లు ఏళ్లుగా కొన్ని బిల్లుల ఆమోదంపై తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-11-20T13:29:33+05:30 IST