Vijayakanth: విజయకాంత్ అంతిమయాత్రకు 10 వేలమంది పోలీసులు
ABN , Publish Date - Dec 30 , 2023 | 08:46 AM
డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్(Vijayakanth)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. స్థానిక మెరీనా బీచ్ సమీపంలోని ఐల్యాండ్ గ్రౌండ్‌లో విజయకాంత్ పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు శుక్రవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంజలి ఘటించారు.
ప్యారీస్(చెన్నై): డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్(Vijayakanth)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. స్థానిక మెరీనా బీచ్ సమీపంలోని ఐల్యాండ్ గ్రౌండ్‌లో విజయకాంత్ పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు శుక్రవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంజలి ఘటించారు. అనంతరం పార్థివదేహానికి కోయంబేడులో ఉన్న డీఎండీకే(DMDK) కార్యాలయ ప్రాంగణంలో అంత్యక్రియలు జరిపేందుకు ప్రత్యేక వాహనంలో ఐల్యాండ్ గ్రౌండ్ నుంచి బయల్దేరింది. ఈ యాత్ర సెంట్రల్ రైల్వేస్టేషన్ మీదుగా ఈవేరా పెరియార్ రోడ్డు, వెపేరి, పోలీస్ కమిషనర్ కార్యాలయం, రిప్పన్ భవనం, ఎగ్మూర్, దాసప్రకాశ్, కీల్పాక్కం, టైలర్స్ రోడ్డు, పచ్చయప్ప కళాశాల, అమింజికరై, అరుంబాక్కం మీదుగా సాగింది. ఈ యాత్రలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొనగా, యాత్ర సాగిన మార్గంలో రోడ్డుకిరువైపులా నిల్చున్న ప్రజలు చేతులు జోడించి కన్నీటితో విజయకాంత్‌కు వీడ్కోలు పలికారు. అంతిమయాత్రకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 10 వేల మందికి పైగా పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు.
