Venad Express: కేరళలో ప్రయాణికుల కోసం కిలోమీటరు రివర్స్ వచ్చిన రైలు.. కారణం ఏంటంటే?
ABN , First Publish Date - 2023-05-22T20:57:04+05:30 IST
కేరళలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుల కోసం ఓ రైలు దాదాపు అర కిలోమీటరు వెనక్కి వచ్చింది. ప్రయాణికులు ఎక్కేందుకు వేచి ఉన్న రైల్వే స్టేషన్‌లో ఆగకుండా ముందుకు వెళ్లిన రైలు తిరిగి వెనక్కి వచ్చిన ఘటన చెరియనాడ్ రైల్వే స్టేషన్ జరిగింది. అలప్పుజా జిల్లాలోని షోరనూర్ వెళ్లే వేనాడ్ ఎక్స్‌ప్రెస్ లోకో ఫైలట్ మర్చిపోవడంతో ఆగాల్సిన స్టాప్ దాటి దాదాపు కిలోమీటరు దూరం వెళ్లింది.
చెరియానాడ్: కేరళలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుల కోసం ఓ రైలు దాదాపు అర కిలోమీటరు వెనక్కి వచ్చింది. ప్రయాణికులు ఎక్కేందుకు వేచి ఉన్న రైల్వే స్టేషన్‌లో ఆగకుండా ముందుకు వెళ్లిన రైలు తిరిగి వెనక్కి వచ్చిన ఘటన చెరియనాడ్ రైల్వే స్టేషన్ లో జరిగింది. అలప్పుజా జిల్లాలోని షోరనూర్ వెళ్లే వేనాడ్ ఎక్స్‌ప్రెస్ లోకో ఫైలట్ మర్చిపోవడంతో ఆగాల్సిన స్టాప్ దాటి దాదాపు కిలోమీటరు దూరం వెళ్లింది.
మావెలిక్కర -చెంగన్నూర్ స్టేషన్ల మధ్య ఉన్న చిన్న హాల్ట్ చెరియనాడ్ స్టేషన్ వద్ద ఉదయం 7.45 గంటలకు ఈ సంఘటన జరిగింది. అయితే ఈ ఘటనపై ప్రయాణీకుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కోలేదు.. రైలు సమయానికి గమ్యస్థానానికి చేరుకుందని రైల్వే అధికారులు తెలిపారు.
చేరియానాడ్ స్టేషన్‌లో సిగ్నల్ లేదా స్టేషన్ మాస్టర్ లేకపోవడంతో లోకో పైలట్ తప్పుగా అంచనా వేయడానికి దారితీసిందని అధికారులు తెలిపారు. లోకో పైలట్‌ల నుంచి వివరణ కోరనున్నట్లు అధికారులు తెలిపారు.