Vande Bharat Sleeper train: 2024 ఫిబ్రవరిలో పట్టాలపైకి వందే భారత్ స్లీపర్ కోచ్

ABN , First Publish Date - 2023-09-30T21:08:14+05:30 IST

కొత్త డిజైన్‌తో వందేభారత్ స్లీపర్ ట్రైన్ తయారీకి రంగం సిద్ధం చేసినట్టు ఇండియన్ రైల్వేస్ శనివారంనాడు ప్రకటించింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంయుక్తంగా వందేభారత్ స్లీపర్ కోచ్‌లకు రూపకల్పన చేస్తున్నాయి. కొత్తగా డిజైన్ చేసిన స్పీపర్ కోచ్‌లతో తొలి వందే భారత్ రైలు 2024 ఫిబ్రవరి నాటికి పట్టాలపైకి రానుంది.

Vande Bharat Sleeper train: 2024 ఫిబ్రవరిలో పట్టాలపైకి వందే భారత్ స్లీపర్ కోచ్

న్యూఢిల్లీ: కొత్త డిజైన్‌తో వందేభారత్ స్లీపర్ ట్రైన్ (Vande Bharat sleeper train) తయారీకి రంగం సిద్ధం చేసినట్టు ఇండియన్ రైల్వేస్ (Indian Railways) శనివారంనాడు ప్రకటించింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) సంయుక్తంగా వందేభారత్ స్లీపర్ కోచ్‌లకు రూపకల్పన చేస్తు్న్నాయి. కొత్తగా డిజైన్ చేసిన స్పీపర్ కోచ్‌లతో తొలి వందే భారత్ రైలు 2024 ఫిబ్రవరి నాటికి పట్టాలపైకి రానున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.


రాత్రికి రాత్రి దూరప్రయాణాలు చేసే ప్రయాణికులకు ఈ వందేభారత్ స్పీపర్ కోచ్‌లలో ప్రయాణించేందుకు అనుమతిస్తారని, ప్రగతి, స్వయం సమృద్ధి భారత్‌కు సంకేతంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించే ఈ సెమీ లైట్ స్పీడ్ ట్రైన్లలో జర్నీ చేయడం ప్రయాణికులకు సరికొత్త అనునుభూతిని కలిగిస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. స్పీడ్, సేఫ్టీ, సర్వీస్ ఈ రైళ్ల ప్రత్యేకతని తెలిపాయి.


న్యూఢిల్లీ-వారణాసి మధ్య నడిచే తొలి వందేభారత్ భారత్ రైలును 2019 ఫిబ్రవరి 15న మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. 'మేక్ ఇండియా' ఇనేషియేటివ్ కింద చెన్నైలోని ఇండిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలు భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యా్న్ని చాటిచెప్పింది. ఐసీఎప్-చెన్నై 2017 మధ్యలో తయారీ ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేసింది.

Updated Date - 2023-09-30T21:08:14+05:30 IST