Union Minister: శ్రీలంకకు కేంద్రమంత్రి మురుగన్
ABN , First Publish Date - 2023-02-10T10:09:16+05:30 IST
కేంద్ర సహాయమంత్రి ఎల్.మురుగన్(L. Murugan) నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఉదయం చెన్నై నుంచి విమానం ద్వారా శ్రీలంక బయలుదేరి
ప్యారీస్(చెన్నై), ఫిబ్రవరి 9: కేంద్ర సహాయమంత్రి ఎల్.మురుగన్(L. Murugan) నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఉదయం చెన్నై నుంచి విమానం ద్వారా శ్రీలంక బయలుదేరి వెళ్లారు. శ్రీలంక సముద్రతీర ప్రాంతంలో చేపలు పడుతున్న 1,100 మంది జాలర్ల పడవలు విడిపించేందుకు లంక ప్రభుత్వంతో చర్చించేందుకు మంత్రి మురుగన్ వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యాల్పానంలో కొత్తగా నిర్మించిన సంప్రదాయ భవన ప్రారంభోత్సవంలోనూ మంత్రి పాల్గొంటారు. మంత్రి మురుగన్‌తో పాటు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై, మరికొంతమంది కేంద్రప్రభుత్వ అధికారులు కూడా శ్రీలంక వెళ్లారు. ఇదిలా ఉండగా శ్రీలంకలోని జాఫ్నా ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానం మూడుగంటల ఆలస్యంగా బయలుదేరింది. దీంతో మంత్రి మురుగన్ సహా పలువురు అసౌకర్యానికి గురయ్యారు.