Union Minister: కేంద్రమంత్రిపై పరువునష్టం దావా రద్దుకు హైకోర్టు నిరాకరణ

ABN , First Publish Date - 2023-09-06T09:20:22+05:30 IST

కేంద్ర మత్స్యశాఖ మంత్రి ఎల్‌.మురుగన్‌(Union Fisheries Minister L. Murugan)పై దాఖలైన పరువు నష్టం దావాను రద్దు చేసేందుకు

Union Minister: కేంద్రమంత్రిపై పరువునష్టం దావా రద్దుకు హైకోర్టు నిరాకరణ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కేంద్ర మత్స్యశాఖ మంత్రి ఎల్‌.మురుగన్‌(Union Fisheries Minister L. Murugan)పై దాఖలైన పరువు నష్టం దావాను రద్దు చేసేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణను మూడు నెలల్లోగా ముగించాలని ప్రత్యేక కోర్టును ఆదేశించింది. 2019లో మురుగన్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వేలూరులో జరిగిన బహిరంగ సభలో డీఎంకే పత్రిక మురసొలి కార్యాలయం కోసం పంచమి భూములను ఆక్రమించుకుని నిర్మించుకున్నట్లు ఆరోపించారు. మురసొలి ట్రస్టు ఆయనపై పరువునష్టం కేసు దాఖలు చేసింది. ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ మురుగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై అన్ని పక్షాల వాదోపవాదాలు ముగిసిన తర్వాత పరువునష్టం దావా రద్దుకు హైకోర్టు నిరాకరించింది.

Updated Date - 2023-09-06T09:20:23+05:30 IST