Two Encounters : రాజౌరి,బారాముల్లాలో రెండు ఎన్‌కౌంటర్లు...ఉగ్రవాది హతం

ABN , First Publish Date - 2023-05-06T07:44:32+05:30 IST

జమ్మూకశ్మీరులో శనివారం రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి....

Two Encounters : రాజౌరి,బారాముల్లాలో రెండు ఎన్‌కౌంటర్లు...ఉగ్రవాది హతం
Two Encounters

శ్రీనగర్: జమ్మూకశ్మీరులో శనివారం రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. రాజౌరి, బారాముల్లాలో రెండు ఎన్‌కౌంటర్లలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.(Two Encounters)బారాముల్లాలోని కర్హమా కుంజర్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని కశ్మీర్ జోన్ పోలీసులు శనివారం తెలిపారు.రాజౌరిలో ఇప్పటికే భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. బారాముల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.(Terrorist killed) రాజౌరిలోని కంది అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో ఐదుగురు సైనికులు మరణించారు. శనివారం తెల్లవారుజామున 1.15 గంటలకు భద్రతా బలగాలకు ఉగ్రవాదులు కనిపించారని, ఎదురు కాల్పులు జరుగుతున్నాయని రక్షణశాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.(Rajouri, Baramulla)

శుక్రవారం ఉదయం కంది అటవీ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భారత సైనికులు మరణించగా, ఒక అధికారి గాయపడ్డారు.శుక్రవారం మరణించిన నలుగురు సైనికులు 9 పారా (స్పెషల్ ఫోర్సెస్)కి చెందిన కమాండోలు కాగా, ఐదవ సైనికుడు రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు చెందినవారు.మృతుల్లో అఖ్నూర్‌కు చెందిన హవల్దార్ నీలం సింగ్, పాలంపూర్‌కు చెందిన నాయక్ అరవింద్ కుమార్, ఉత్తరాఖండ్‌లోని గైర్‌సైన్‌కు చెందిన లాన్స్ నాయక్ రుచిన్ సింగ్ రావత్, డార్జిలింగ్‌కు చెందిన పారాట్రూపర్ సిద్ధాంత్ చెత్రీ, హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌కు చెందిన పారాట్రూపర్ ప్రమోద్ నేగీలు ఉన్నారు. జమ్మూ ప్రాంతంలోని భాటా ధురియన్‌లోని టోటా గలి ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల బృందాన్ని ఏరివేయడానికి భారత సైన్యం గాలింపు చేపట్టింది.

Updated Date - 2023-05-06T08:04:30+05:30 IST