TTV Dinakaran: ఉప ఎన్నికలో ఎవ్వరికీ మద్దతివ్వం..
ABN , First Publish Date - 2023-02-09T10:29:30+05:30 IST
ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎవ రికీ మద్దతు ప్రకటించలేదని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్
- టీటీవీ దినకరన్
ప్యారీస్(చెన్నై), ఫిబ్రవరి 8: ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎవ రికీ మద్దతు ప్రకటించలేదని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్(TTV Dinakaran) పేర్కొన్నారు. రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశం దినకరన్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్ తమ పార్టీ అభ్యర్థికి కుక్కర్ చిహ్నం కేటాయిస్తుందన్న నమ్మకంతోనే ఉప ఎన్నికలో నామినేషన్ వేశామని, అయితే తాము కోరిన గుర్తు కేటాయించని కారణంగా ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. రెండాకుల గుర్తుపై పోటీచేసినంత మాత్రాన అన్నాడీఎంకే గెలవడం సాధ్యం కాదన్నారు. 2024లో లోక్‌సభకు జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీల్లో ఎవరైనా ఆహ్వానిస్తే ఆ కూటమిలో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని దినకరన్ తెలిపారు.
ఇదికూడా చదవండి: ‘బీజేపీ-అన్నాడీఎంకే’లా కాపురం చేయొద్దు