TTV Dhinakaran: ఆయనకసలు రాజకీయ పరిజ్ఞానం ఉందా..

ABN , First Publish Date - 2023-06-14T07:37:12+05:30 IST

ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేకుండా, దివంగత ముఖ్యమంత్రి జయలలితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Anna

TTV Dhinakaran: ఆయనకసలు రాజకీయ పరిజ్ఞానం ఉందా..

- టీటీవీ దినకరన్‌ ధ్వజం

అడయార్‌(చెన్నై): ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేకుండా, దివంగత ముఖ్యమంత్రి జయలలితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే శ్రేణులే కాకుండా, అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌(TTV Dhinakaran) కూడా ఒక పత్రికా ప్రకటనలో విమర్శలు గుప్పించారు. 1998లో జయలలిత కృషి ఫలితంగా ఏర్పాటైన ఎన్డీయే కూటమి ఎంతో కీలకంగా వ్యవహరించిందన్నారు. బీజేపీ అగ్రనేతలు వాజ్‌పేయి, ఎల్కే ఆడ్వాణీతో కలిసి ఈ కూటమి ఏర్పాటులోనూ, విజయవంతంగా ముందుకు సాగడంలో ఎంతో కృషి చేశారన్నారు. ఈ విషయంపై అన్నామలైకు అవగాహన లేదన్నారు. స్థానిక మెరీనా తీరంలో జరిగిన అభ్యర్థుల పరిచయ సభలో వాజ్‌పేయి పాల్గొని .. జయలలిత గొప్పతనం గురించి ప్రసంగించిన విషయం యావత్‌ ప్రపంచానికి తెలుసన్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో బీజేపీ విజయావకాశాలు కల్పించిన మహిళా నేత జయలలిత అని అన్నారు. జయ మృతి తర్వాత రాష్ట్రంలో సాగిన ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అన్నామలై చెప్పగలరా అని ప్రశ్నించారు. అవినీతిని నిర్మూలించాలంటూ గొంతు చించుకుని ప్రసంగాలు చేసే అన్నామలై... అవినీతిని నిర్మూలించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అని టీటీవీ దినకరన్‌ ప్రశ్నించారు.

Updated Date - 2023-06-14T07:37:12+05:30 IST