Train catches fire: గోద్రా వెళ్తుండగా రైలులో మంటలు..

ABN , First Publish Date - 2023-09-15T15:21:29+05:30 IST

గుజరాత్‌లోని దహోద్ జిల్లా జకోట్ స్టేషన్ వద్ద దహోద్ ఆనంద్ మెము ట్రైన్‌ లోని ఒక కోచ్‌లో శుక్రవారంనాడు మంటలు చెలరేగాయి. రైలు గోద్రా వెళ్తుండగా జకోట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదన్నారు.

Train catches fire: గోద్రా వెళ్తుండగా రైలులో మంటలు..

దహోద్: గుజరాత్‌లోని దహోద్ (Dahod) జిల్లా జకోట్ స్టేషన్ వద్ద దహోద్ ఆనంద్ మెము ట్రైన్‌ (Dahot Anand Memu Train)లోని ఒక కోచ్‌లో శుక్రవారంనాడు మంటలు చెలరేగాయి. రైలు గోద్రా (Godhra) వెళ్తుండగా జకోట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. కోచ్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు గందరగోళానికి గురై తొక్కిసలాట జరిగిందని, అయితే ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.


అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. దహోద్ ఏఎస్‌పీ, రైల్వే సీనియర్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. రైలు చివరి కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయని, తక్కిన వాటికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఏఎస్‌పీ కె.సిధాంత్ తెలిపారు.

Updated Date - 2023-09-15T15:27:19+05:30 IST