Stalin: రూ. 2వేల నోట్ల రద్దుపై సీఎం సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-05-21T10:27:35+05:30 IST

రిజర్వు బ్యాంక్‌ రూ.2 వేల రూపాయల నోట్ల చెలామణీని రద్దు చేయనున్నట్టు ప్రకటించడం కేంద్రంలో అధికారంలో ఉన్న

Stalin: రూ. 2వేల నోట్ల రద్దుపై సీఎం సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

చెన్నై: రిజర్వు బ్యాంక్‌ రూ.2 వేల రూపాయల నోట్ల చెలామణీని రద్దు చేయనున్నట్టు ప్రకటించడం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలకులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చవిచూసిన ఓటమిని కప్పిపుచ్చేందుకు ఉపయోగించిన మంత్రమని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌ పేజీలో... 500 సందేహాలు, 1000 మర్మాలు, 2000 తప్పిదాలు ఇదంతా కర్ణాటకలో చిత్తుగా ఓడిపోయిన విషయాన్ని కప్పిపుచ్చేందుకు ఉపయోగించే ఏకైక తూతూ మంత్రం’ అంటూ విమర్శించారు.

గడువు పొడిగించండి...

ఇదిలా ఉండగా రెండువేల రూపాయల నోట్లను బ్యాంకులలో మార్చుకునేందుకు డిసెంబర్‌ నెలాఖరువరకు గడువు పెంచాలని రాష్ట్ర వాణిజ్య సంఘాల సమాఖ్య నాయకుడు విక్రమ్‌రాజా రిజర్వుబ్యాంక్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో నోట్లను బ్యాంకుల్లో ఇచ్చి మార్చుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ప్రస్తుతం ఆ పరిస్థితి తలెత్తకుండా చూడాలని కోరారు.

Updated Date - 2023-05-21T10:27:35+05:30 IST