Special buses: వేలాంకన్నికి 850 ప్రత్యేక బస్సులు
ABN , First Publish Date - 2023-08-25T09:15:32+05:30 IST
నాగపట్టణం జిల్లా వేలాంకన్ని(Velankanni) ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం నుంచి సెప్టెంబరు 11వ తేది వరకు 850 ప్రత్యేక
ఐసిఎఫ్(చెన్నై): నాగపట్టణం జిల్లా వేలాంకన్ని(Velankanni) ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం నుంచి సెప్టెంబరు 11వ తేది వరకు 850 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు రాష్ట్ర ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ తెలిపింది. చెన్నై, బెంగుళూరు, తూత్తుకుడి, కన్నియాకుమారి, నాగర్‌కోయిల్(Chennai, Bangalore, Thoothukudi, Kanniyakumari, Nagercoil) నుంచి ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థతో పాటు ఇతర రవాణా సంస్థల ఆధ్వర్యంలో తిరుచ్చి, తంజావూరు, చిదంబరం, పుదుచ్చేరి, దిండుగల్, మనప్పారై, పట్టుకోట నుంచి వేలాంకన్నికి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఈ బస్సులకుగాను టిక్కెట్ రిజర్వేషన్ గురువారం ప్రారంభమైంది.