Share News

Uttarakhand: ఇటుక బట్టీ గోడ కూలి ఆరుగురు దుర్మరణం, పలువురికి గాయాలు

ABN , Publish Date - Dec 26 , 2023 | 03:39 PM

ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో మంగళవారంనాడు ఘోర విషాదం చోటుచేసుకుంది. లహబోలి గ్రామంలో ఇటుక బట్టీ గోడకూలి బట్టీ కార్మికులు ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గోడ శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి.

Uttarakhand: ఇటుక బట్టీ గోడ కూలి ఆరుగురు దుర్మరణం, పలువురికి గాయాలు

రూర్కీ: ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని రూర్కీ (Rookee)లో మంగళవారంనాడు ఘోర విషాదం చోటుచేసుకుంది. లహబోలి గ్రామంలో ఇటుక బట్టీ (brilck kiln) గోడకూలి బట్టీ కార్మికులు ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గోడ శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి.


ప్రాథమిక సమాచారం ప్రకారం, బట్టీలో ఇటుకలు నింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానిక యంత్రాంగ, పోలీసులు రంగంలోకి దిగారు. జేసీబీ సాయంతో శిథిలాలను తొలగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. వైద్య సహాయక బృందం కూడా ఘటనా స్థలికి చేరుకుంది.

Updated Date - Dec 26 , 2023 | 03:39 PM