Sikkim Floods: సిక్కిం వరదల్లో 82 కి చేరిన మృతుల సంఖ్య.. చిక్కుకున్న 3 వేల మంది టూరిస్టులు

ABN , First Publish Date - 2023-10-09T11:02:10+05:30 IST

సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) కారణంగా సంభవించిన వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారి సంఖ్య తాజాగా 82 కు చేరింది. లాచెన్, లాచుంగ్(Lachen, Lachung) పట్టణాలలో 3 వేల మంది పర్యాటకులు(Tourists) చిక్కుకుపోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

Sikkim Floods: సిక్కిం వరదల్లో 82 కి చేరిన మృతుల సంఖ్య.. చిక్కుకున్న 3 వేల మంది టూరిస్టులు

గ్యాంగ్ టక్: సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) కారణంగా సంభవించిన వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారి సంఖ్య తాజాగా 82 కు చేరింది. లాచెన్, లాచుంగ్(Lachen, Lachung) పట్టణాలలో 3 వేల మంది పర్యాటకులు(Tourists) చిక్కుకుపోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గురుడోంగ్ మార్ సరస్సుకు వెళ్లే పర్యాటకులు లాచెన్ లో స్టే చేస్తారు. 5 రోజుల క్రితం అలాగే వెళ్లిన ప్రయాణికులు అకస్మాత్తుగా వరదలు రావడంతో అక్కడే చిక్కుకుపోయారు. చాలా రోజుల వరకు ఇంటర్నెట్ పని చేయకవడంతో అధికారులకు సమాచారాన్ని చేరవేయడంలో ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. ఈ వరదల్లో ఆర్మీ(Indian Army) జవాన్లు సైతం గల్లంతయ్యారు.


గల్లంతైన సైనికుల కోసం దళాలు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.ఒకే జిల్లాలో సుమారు 50 గ్రామాలు, పట్టణాలు కకావికలం అయ్యాయి. దాదాపు 30 వేల మంది ప్రభావితమయ్యారని అధికారులు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్(NDRF) బృందాలు రంగంలోకి దిగి చుంగ్ తాంగ్ లో చిక్కుకున్న 56 మందిని రక్షించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆదివారం రెస్క్యూ ఆపరేషన్ కి ఇబ్బంది అయింది. నిన్న మంగన్, గ్యాంగ్ టక్ లో మళ్లీ భారీ వర్షం కురిసింది. ఇవాళ్లైనా రెస్క్యూ ఆపరేషన్ వేగం పుంజుకుంటుందని ఆశిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం సోమవారం గ్యాంగ్ టక్ రానుంది. నష్ట అంచనా అనంతరం నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనుంది. వరద బాధిత కుటంబాలకు సైన్యం ఆహారం, వైద్యం తదితర సౌకర్యాలు కల్పిస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు .

Updated Date - 2023-10-09T11:02:51+05:30 IST