Schools: ఓపక్క ఎండలు మండిపోతున్నాయి.. చిన్నారులను ఎలా పంపాలి...
ABN , First Publish Date - 2023-05-28T13:27:28+05:30 IST
వేసవి సెలవులు ఆదివారంతో పూర్తి కావడంతో సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయి. విద్యార్థులు తమ పాఠశాలకు
రేపటినుంచే పాఠశాలల పునః ప్రారంభం
కంప్లి(బెంగళూరు): వేసవి సెలవులు ఆదివారంతో పూర్తి కావడంతో సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయి. విద్యార్థులు తమ పాఠశాలకు, హాస్టళ్లకు తమ గ్రామాల నుంచి ప్రయాణం సాగించారు. విద్యాశాఖ ఈ యేడాది 2023-24 విద్యా సంవత్సరం 29వ తేదీన పాఠశాలలను పునః ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో పాఠశాలలో ఇప్పటికే పరిశుభ్రం చేపట్టి సిద్దంగా వుంచారు. పాఠశాలలు(Schools) ప్రారంభమైన వెంటనే పుస్తకాలు, యూనిఫారమ్‌లు అం దుబాటులో వుంటాయని అధికారులు వెల్లడిచారు.