Schools: 7 నుంచే పాఠశాలల పునఃప్రారంభం

ABN , First Publish Date - 2023-05-27T07:05:15+05:30 IST

రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం జూన్‌ 7వ తేదీ నుంచి పాఠశాలలు(Schools) పునఃప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ

Schools: 7 నుంచే పాఠశాలల పునఃప్రారంభం

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం జూన్‌ 7వ తేదీ నుంచి పాఠశాలలు(Schools) పునఃప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ ప్రకటించారు. 2023-24వ విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాల విద్యాశాఖ ప్రణాళికను గతంలో మంత్రి అన్బిల్‌ మహేష్‌(Minister Anbil Mahesh) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం, వేసవి సెలవులు ముగిసి జూన్‌ 1వ తేది 6 నుంచి ప్లస్‌ టూ వరకు, 5వ తేది నుంచి 1 నుంచి 5వ తరగతి వరకు పాఠశాలలు ప్రారంభమవుతాయని కూడా ఆయన గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో విద్యార్థుల సంక్షేమార్ధం పాఠశాలల ప్రారంభం వాయిదావేయాలని రాజకీయపార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి అన్బిల్‌ మహేష్‌ జిల్లా ప్రధాన విద్యాధికారులతో ఇటీవల సమావేశమయ్యారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో, పాఠశాలల ప్రారంభం వాయిదా వేయాలని పలు జిల్లాల అధికారులు మంత్రికి విన్నవించారు. ఈ క్రమంలో, మంత్రి అన్బిల్‌ మహేష్‌ శుక్రవారం పంపిణీకి సిద్ధంగా వున్న పాఠ్యపుస్తకాలను చెన్నైలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని జూన్‌ 7వ తేది నుంచి పాఠశాలలు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

nani1.3.jpg

Updated Date - 2023-05-27T07:10:46+05:30 IST