Share News

Youtuber: ఢిల్లీలో రష్యన్ యూట్యూబర్‌కి వేధింపులు.. వైరల్ అవుతున్న వీడియో

ABN , First Publish Date - 2023-10-21T14:55:49+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఫేమస్ రష్యన్ యూట్యూబర్(Russian YouTuber) పై వేధింపుల(Harassment) ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Youtuber: ఢిల్లీలో రష్యన్ యూట్యూబర్‌కి వేధింపులు.. వైరల్ అవుతున్న వీడియో

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఫేమస్ రష్యన్ యూట్యూబర్(Russian YouTuber) పై వేధింపుల(Harassment) ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఓ ఆకతాయి ఆమె వెంట పడి ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు..’ అంటూ వేధింపులకు గురిచేశాడు. రష్యాకు చెందిన యువతి కోకో ఇన్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్(Youtube Channel) నడుపుతోంది. ఆమె ఇండియా(India)లోని పలు ప్రాంతాలను సందర్శించి, వీడియోలు చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేస్తుంటుంది.


ఈ క్రమంలో ఆమె ఢిల్లీ(Delhi)లోని సరోజినీ నగర్ మార్కెగ్ లో పర్యటించింది. అక్కడ యూట్యూబ్ లైవ్ ప్రారంభించింది. ఆమెను గమనించిన ఓ ఆకతాయిలు వెంట పడ్డారు. అందంగా ఉన్నావంటూ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఒకరు మీ వీడియోలు తాను చూస్తూ ఉంటానని.. మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉందంటూ మాట కలిపాడు. అతని ప్రవర్తనతో ఇబ్బందికి గురైన యూట్యూబర్ అతను అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. వేధింపులకు గురి చేసిన యువకుడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అతని తరఫున రష్యన్ యూట్యూబర్ కు క్షమాపణలు చెబుతున్నారు. "భారతీయుడిగా అతని ప్రవర్తనకు నేను క్షమాపణలు కోరుతున్నాను" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా. తాను సిగ్గుపడుతున్నానని, ఇలాంటి ఘటనలు జరుగుతుండటం బాధకరమని, యూట్యూబర్ ధైర్య సాహసాలకు నమస్కరిస్తున్నట్లు మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

Updated Date - 2023-10-21T14:56:28+05:30 IST