Rs 2 thousand notes: నేటినుంచి రూ.2 వేల నోట్లు తీసుకోవద్దు

ABN , First Publish Date - 2023-09-28T07:19:06+05:30 IST

ప్రయాణికుల నుంచి రూ.2 వేల నోట్లను ఈనెల 28న గురువారం నుంచి తీసుకోవద్దని బస్‌ కండక్టర్లకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Rs 2 thousand notes: నేటినుంచి రూ.2 వేల నోట్లు తీసుకోవద్దు

ఐసిఎఫ్‌(చెన్నై): ప్రయాణికుల నుంచి రూ.2 వేల నోట్లను ఈనెల 28న గురువారం నుంచి తీసుకోవద్దని బస్‌ కండక్టర్లకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ప్రస్తుతం చెలామణి ఉన్న రూ.2 వేల నోట్లు అక్టోబరు నుంచి చెల్లకపోనుండడంతో వాటిని త్వరలో బ్యాంకుల్లో మార్చుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. టిక్కెట్లు తీసుకొనేందుకు ప్రయాణికులు ఇచ్చే రూ.2 వేల నోట్లను తీసుకోవాలని ఇదివరకే రవాణా సంస్థ కండక్టరర్లకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వుల మేరకు కండక్టర్లు వాటిని తీసుకొని టిక్కెట్లు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈనెల 28న గురువారం నుంచి రూ.2 వేల నోట్లను తీసుకోరాదని ప్రభుత్వ రవాణా సంస్థ ఉత్వర్వులు జారీ చేసింది.

Updated Date - 2023-09-28T07:19:06+05:30 IST