Ramdas: ఆ రోజున మద్యం దుకాణాలు మూసివేయాలి
ABN , Publish Date - Dec 17 , 2023 | 10:29 AM
మిచౌంగ్ తుఫాను వరద సాయం నగదు పంపిణీ చేసే రోజున టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయాలని
- డాక్టర్ అన్బుమణి
అడయార్(చెన్నై): మిచౌంగ్ తుఫాను వరద సాయం నగదు పంపిణీ చేసే రోజున టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయాలని పీఎంకే అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి రాందాస్(Dr. Anbumani Ramdas) ప్రభుత్వాన్ని కోరారు. వరద ముంపు ప్రాంతాల్లో ఆదివారం నుంచి ప్రభుత్వం రూ.6 వేల చొప్పున వరద సాయం పంపిణీ చేయనుంది. ఈ నగదు పంపిణీని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) వేళచ్చేరిలో ఉన్న అష్టలక్ష్మి నగర్‌లోని ఓ రేషన్ షాపు నుంచి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నగదు పంపిణీ చేసే ప్రాంతాల్లోని మద్యం దుకాణాలను మూసి వేయాలని అన్బుమణి కోరారు.