Ramdas: మరీ ఇంత దారుణమా.. ఓ విద్యార్థిని లోదుస్తుల్ని తొలగించి..

ABN , First Publish Date - 2023-05-09T13:31:35+05:30 IST

ఓ విద్యార్థిని లోదుస్తుల్ని తొలగించి తనిఖీ చేసిన ఘటనపై పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌

Ramdas: మరీ ఇంత దారుణమా.. ఓ విద్యార్థిని లోదుస్తుల్ని తొలగించి..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): నీట్‌ పరీక్షల సందర్భంగా మైలాపూరు కేంద్రం వద్ద ఓ విద్యార్థిని లోదుస్తుల్ని తొలగించి తనిఖీ చేసిన ఘటనపై పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌(PMK President Dr. Anbumani Ramdas) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష రాయడానికి వెళ్ళిన విద్యార్థినీని తనిఖీ సిబ్బంది బ్రా తొలగించమన్నాడు. దిగ్ర్భాంతి చెందిన ఆ విద్యార్థిని అప్పటికే పరీక్ష హాజరు సమయం దగ్గరపడుతుండటంతో విధిలేని పరిస్థితుల్లో బ్రా తొలగించింది. ఆ తర్వాత ఆ విద్యార్థినిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఈ ఘటన సామాజిక ప్రసార మాధ్యమాల్లో కలకలం సృష్టించింది. ఆ ఘటనపై అన్బుమణి రాందాస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనిఖీ సిబ్బంది లోదుస్తుల్ని తొలగించమని చెప్పటం మానవహక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు. ఈ సంఘటనకు బాధ్యుడైన సిబ్బందిపపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-05-09T13:31:35+05:30 IST