Independence Day : మణిపూర్ రాష్ట్రానికి అండగా యావద్భారతావని : మోదీ

ABN , First Publish Date - 2023-08-15T10:03:16+05:30 IST

మణిపూర్ రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సమస్య పరిష్కారం శాంతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోటపై నుంచి ఆయన మాట్లాడారు.

Independence Day : మణిపూర్ రాష్ట్రానికి అండగా యావద్భారతావని : మోదీ
Narendra Modi

న్యూఢిల్లీ : మణిపూర్ రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. ఈ సమస్య పరిష్కారం శాంతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోటపై నుంచి ఆయన మాట్లాడారు.

గత కొన్ని వారాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా మణిపూర్‌లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. భారత దేశ ఆడబిడ్డల గౌరవ, మర్యాదలకు తీవ్ర భంగం కలిగిందని చెప్పారు. అయితే గత కొన్ని రోజుల నుంచి అక్కడ ప్రశాంతత ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. యావద్భారతావని మణిపూర్ రాష్ట్రానికి, ప్రజలకు అండగా ఉందని తెలిపారు.

కొన్ని రోజుల నుంచి నెలకొన్న శాంతి ఆధారంగా మణిపూర్ ప్రజలు ప్రశాంతతను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. శాంతి ద్వారా మాత్రమే పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పారు.


ప్రకృతి వైపరీత్యాల వల్ల బాధితులైనవారికి సంఘీభావం ప్రకటిస్తూ, మృతులకు సంతాపం తెలిపారు. ఈ సంవత్సరం మన దేశంలోని చాలా రాష్ట్రాలు అనూహ్యమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సవాలును అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేస్తాయని చెప్పారు.

ఎర్ర కోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగించడం వరుసగా ఇది పదోసారి. ఈసారి ఆయన దేశ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా సంబోధించారు. ‘‘పరివార్‌జన్’’ (కుటుంబ సభ్యులు) అని సంబోధిస్తూ ప్రసంగించారు. గతంలో ఆయన దేశ ప్రజలను ‘‘నా ప్రియమైన సోదర, సోదరీమణులారా’’ అని సంబోధించేవారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆయన సరికొత్త రకం తలపాగా, దుస్తులు ధరించారు. వర్ణరంజితమైన రాజస్థానీ బంధని ప్రింట్ తలపాగాను, ఆఫ్-వైట్ కుర్తా, V-నెక్ జాకెట్, చుడీదార్‌లను ధరించారు. తలపాగా పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉంది. దీనికి పొడవైన వస్త్రం వేలాడుతూ ఉంది.


ఇవి కూడా చదవండి :

Independence day : ఢిల్లీ ఎర్రకోట వేదికగా ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Laser heat: లేజర్‌ వేడికి కూలింగ్‌ విరుగుడు

Updated Date - 2023-08-15T10:03:16+05:30 IST