Share News

Rozgar Mela: 51,000 మందికి నియామక పత్రాలను పంపిణీ చేసిన మోదీ

ABN , First Publish Date - 2023-10-28T14:53:12+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కొత్తగా ప్రభుత్వ శాఖల్లోకి తీసుకున్న 51,000 మందికి నియామక పత్రాలను పంపిణీ చేశారు. శనివారంనాడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ నియామక పత్రాలను ఆయన పంపిణీ చేశారు.

Rozgar Mela: 51,000 మందికి నియామక పత్రాలను పంపిణీ చేసిన మోదీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశవ్యాప్తంగా కొత్తగా ప్రభుత్వ శాఖల్లోకి తీసుకున్న 51,000 మందికి నియామక పత్రాలను (appointment letters) పంపిణీ చేశారు. శనివారంనాడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ నియామక పత్రాలను ఆయన పంపిణీ చేశారు. రోజ్‌గార్ మేళా (Rozgar mela_ కింద ఇంతవరకూ లక్షలాది మంది యువకులకు నియామక పత్రాలను అందజేసినట్టు ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. కొత్తగా ఉద్యోగాల్లో తీసుకున్న వారికి అభినందనలు తెలిపారు. కొత్తగా రిక్రూట్ అయిన వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని సంభాషించారు.


''గత ఏడాది అక్టోబర్‌లో రోజ్‌గార్ మేళా ప్రారంభమైంది. కేంద్రం, ఎన్డీయే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వీటిని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంతవరకూ లక్షలాది మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈరోజు 50,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఏటా దీపావళి పండుగ వస్తుంటుంది. ఈరోజు 50 వేలకు పైగా కుటుంబాల వారు ఈ నియామక పత్రాలు తీసుకుంటున్నారు. ఈ సందర్భం దీపావళి పండుగకు ఏమాత్రం తక్కువ కాదు'' అని ప్రధాని అన్నారు.


దేశవ్యాప్తంగా 37 ప్రాంతాల్లో ఈ రోజ్‌గార్ మేళా నిర్వహిస్తున్నారు. కొత్తగా రిక్రూట్ అయిన వారు దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో చేరుతారు. రైల్వే మంత్రిత్వ శాఖ, పోస్టల్ డిపార్ట్‌మెంట్, హోం మంత్రిత్వ శాఖ, రెవెన్యూ శాఖ, హైయర్ ఎడ్యుకేషన్ శాఖ, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, హెల్త్ అండ్ ఫ్యా్మిలీ వెల్ఫేర్, తదితర శాఖల్లో వీరి నియామకాలు జరిగాయి. ఉద్యోగాల కల్పనకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న అత్యంత ప్రాధాన్యతా క్రమంలో భాగంగా ఈ నియామకాలు చేపడుతున్నారు.

Updated Date - 2023-10-28T14:54:47+05:30 IST