Share News

Meri Maati Mera Desh: అమృత్ కలష్ యాత్ర ముగింపు కార్యక్రమంలో మోదీ

ABN , First Publish Date - 2023-10-31T19:47:03+05:30 IST

సమున్నత భారతదేశాన్ని సృష్టించాలనే ఆలోచనతో భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మేరీ మాతీ మేరా దేశ్- అమృత కలష్ యాత్ర' ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి సేకరించిన మట్టిని ప్రధాని మోదీ భారత కలష్‌లో ఉంచారు.

Meri Maati Mera Desh: అమృత్ కలష్ యాత్ర ముగింపు కార్యక్రమంలో మోదీ

న్యూఢిల్లీ: సమున్నత భారతదేశాన్ని సృష్టించాలనే ఆలోచనతో భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ''మేరీ మాతీ మేరా దేశ్- అమృత కలష్ యాత్ర'' (Meri Maati Mera Desh-Amrit Kalash Yatra) ముగింపు యాత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్నారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి సేకరించిన మట్టిని ప్రధాని మోదీ భారత కలష్‌లో ఉంచారు. కలష్‌లోని మట్టిని ఆయన తన నుదుట తిలకంగా దిద్దుకున్నారు. దేశం నలుమూలల నుంచి సేకరించిన ఈ మట్టితో అమృత వాటికను నిర్మించనున్నారు. అమృత్ కలష్ ముగింపు వేడుకలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మేరా మాటీ మోరా దేశ్-అమృత్ కలష్ యత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా ''మోరా యువ భారత్ పోర్టల్''ను ప్రధాని వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించారు.


యువతకు పిలుపు..

అమృత్ కలస్ యాత్ర ముగింపు సందర్భంగా యువతకు మోదీ దిశానిర్దేశం చేశారు. దేశ ప్రగతి లక్ష్యాలను సాధించేందుకు యువత పూర్తి శక్తియుక్తులతో సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇది ముగింపు వేడుకే అయినప్పటికీ, కొన్ని తీర్మానాలకు ప్రారంభమని అన్నారు. 21వ శతాబ్దంలో దేశాభివృద్ధిలో 'మేరా భారత్ యువ' ఆర్గనైజేషన్ కీలక పాత్ర పోషించనుందన్నారు. అనుకున్న ప్రతి లక్ష్యాన్ని యువత కలిసికట్టుగా ఎలా సాధించగలదనే దానికి 'మేరి మాతీ మేరా దేశ్' ఒక ఉదాహరణ అని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జనం హాజరయ్యారు. ఆయా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతం నుంచి హాజరైన ప్రతినిధులు తాము సేకరించిన మట్టిన అమృత్ కలాష్‌లో పోశారు. తన దేశం గొప్పతనం, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇది ప్రతిబింబించింది.


కాగా, దీనికి ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. దేశానికి పటేల్ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. జాతీయ సమైక్యత కోసం పటేల్ చూపిన నిబద్ధత నేటికీ పౌరులకు మర్గనిర్దేశం చేస్తోందని మోదీ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ ట్వీట్ చేశారు.

Updated Date - 2023-10-31T19:47:03+05:30 IST