Share News

Narendra Modi: 2014లోనే కాలం చెల్లిన ఫోన్లను జనం విసిరేశారు.. కాంగ్రెస్‌పై విసుర్లు

ABN , First Publish Date - 2023-10-27T14:46:03+05:30 IST

ప్రజలు కాలం చెల్లిన ఫోన్లను 2014లోనే బయట పడేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బీజేపీ చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో జరిగిన 'ఇండియా మొబైల్ కాంగ్రెస్' ఈవెంట్‌లో ప్రధాని ఈ విషయాన్ని ప్రస్తావించారు.

Narendra Modi: 2014లోనే కాలం చెల్లిన ఫోన్లను జనం విసిరేశారు.. కాంగ్రెస్‌పై విసుర్లు

న్యూఢిల్లీ: ప్రజలు కాలం చెల్లిన ఫోన్లను 2014లోనే బయట పడేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బీజేపీ చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో జరిగిన 'ఇండియా మొబైల్ కాంగ్రెస్' ఈవెంట్‌లో ప్రధాని ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, కాలం చెల్లిన ఫోన్లను రీస్టార్ట్ చేసినా, బ్యాటరీ‌కి చార్జింగ్ చేసినా, బ్యాటరీ మార్చినా ఎలాంటి ఫలితం లేకుండా పోయందని, 2014లో ప్రజలు అలాంటి ఫోన్లను వదిలిపెట్టి, దేశానికి సేవ చేసే అవకాశం తమకు ఇచ్చారని చెప్పారు. 2014 సంవత్సరం మార్పునకు సంకేతమని అన్నారు.


యాపిల్ నుంచి గూగుల్ వరకూ బడా టెక్ కంపెనీలు దేశంలో తాయారీదారులుగా ఉండేందుకు క్యూలు కడుతున్నారని చెప్పారు. ఇటీవలే గూగల్ తమ ఫిక్సెల్ ఫోన్లను ఇండియాలో తయారు చేస్తున్నట్టు ప్రకటించిందని, శాంసంగ్ 5 మొబైల్ ఫోన్, యాపిల్ ఐఫోన్ 15 ఇండియాలో తయారవుతున్నాయని చెప్పారు. మొబైల్ బ్రాండ్‌బ్యాండ్ స్పీడ్‌లో భారత దేశం 43వ స్థానానికి చేరుకుందన్నారు. క్యాపిటల్ యాక్సిస్, రిసోర్సెస్ యాక్సిస్, టెక్నాలజీ యాక్సిస్ అనేవి తమ ప్రభుత్వ ప్రాధాన్యతా క్రమాల్లో ఉన్నాయని వివరించారు. ఇవాళ మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు ప్రపంచమంతా వాడుతున్నారని, దేశంలో 5జిని విస్తరించడం మాత్రమే కాకుండా, 6జి టెక్నాలజీలో లీడర్‌గా నిలిచేందుకు పురోగమిస్తోందని ప్రధాని తెలిపారు.

Updated Date - 2023-10-27T14:46:03+05:30 IST