Puri : పురి దుకాణాల సముదాయంలో అగ్ని ప్రమాదం... ముగ్గురికి గాయాలు...

ABN , First Publish Date - 2023-03-09T13:07:10+05:30 IST

ఒడిశా (Odisha)లోని పురి (Puri) జిల్లాలో బుధవారం రాత్రి దుకాణాల సముదాయం (shopping complex)లో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం

Puri : పురి దుకాణాల సముదాయంలో అగ్ని ప్రమాదం... ముగ్గురికి గాయాలు...
Puri, Odisha

పురి (ఒడిశా) : ఒడిశా (Odisha)లోని పురి (Puri) జగన్నాథుని దేవాలయం సమీపంలోని దుకాణాల సముదాయం (shopping complex)లో బుధవారం రాత్రి పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతమే దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు అన్ని దుకాణాలు దగ్ధమైపోయాయి. సుమారు 140 మందిని సురక్షితంగా కాపాడగలిగారు.

పురి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రాండ్‌ రోడ్‌లోని లక్ష్మీ మార్కెట్ కాంప్లెక్స్‌లో బుధవారం రాత్రి 9 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే ఈ మంటలు సమీపంలోని ఇతర దుకాణాలకు కూడా వ్యాపించాయి. విద్యుదాఘాతమే దీనికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు.

చీఫ్ ఫైర్ ఆఫీసర్ రమేశ్ మాఝి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, దుకాణాల సముదాయంలో అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం అందిన వెంటనే 12 అగ్నిమాపక శకటాలను పంపించినట్లు తెలిపారు. 160 మంది సిబ్బంది మంటలను ఆర్పేందుకు కృషి చేశారన్నారు. సంఘటన స్థలం నుంచి సుమారు 140 మంది యాత్రికులను సురక్షితంగా కాపాడినట్లు తెలిపారు. సుప్రసిద్ధ జగన్నాథ స్వామి (Lord Jagannath Swamy) దేవాలయం సమీపంలోనే ఈ దుకాణాల సముదాయం ఉందని చెప్పారు.

ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ ఎస్‌కే ఉపాధ్యాయ్ మాట్లాడుతూ, మంటలను ఆర్పే సమయంలో ముగ్గురు సిబ్బంది అస్వస్థులయ్యారని, వారిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు.

పురి పోలీస్ సూపరింటెండెంట్ విశాల్ సింగ్ మాట్లాడుతూ, మంటలను పూర్తిగా ఆర్పేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

పురి బీజేపీ ఎమ్మెల్యే జయంత్ సారంగి మాట్లాడుతూ, హోటళ్లు, ఇతర దుకాణాలవల్ల అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి :

China-Pak Vs India : చైనా, పాక్‌ల నుంచి భారత్ భద్రతకు ముప్పు : అమెరికన్ ఇంటెలిజెన్స్

Pakistan: పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమిదే...

Updated Date - 2023-03-09T13:07:10+05:30 IST