Share News

New Year: న్యూ ఇయర్‌ సందర్భంగా ట్రాఫిక్‌ మార్పులు

ABN , Publish Date - Dec 31 , 2023 | 09:57 AM

ఆంగ్ల సంవత్సరాది వేడుకలను పురస్కరించుకొని స్థానిక మెరీనా బీచ్‌(Marina Beach) సమీపంలోని కామరాజర్‌ రోడ్డు, ఎలియాట్‌ బీచ్‌ ప్రాంతాల్లో ఈనెల 31వ తేది సాయంత్రం 7 నుంచి జవనరి 1వ తేది ఉదయం 6 గంటలకు వరకు ట్రాఫిక్‌ మార్పులు చేపట్టినట్టు నగర పోలీసు కమిషనర్‌ సందీప్‌రాయ్‌ రాథోడ్‌ పేర్కొన్నారు.

New Year: న్యూ ఇయర్‌ సందర్భంగా ట్రాఫిక్‌ మార్పులు

పెరంబూర్‌(చెన్నై): ఆంగ్ల సంవత్సరాది వేడుకలను పురస్కరించుకొని స్థానిక మెరీనా బీచ్‌(Marina Beach) సమీపంలోని కామరాజర్‌ రోడ్డు, ఎలియాట్‌ బీచ్‌ ప్రాంతాల్లో ఈనెల 31వ తేది సాయంత్రం 7 నుంచి జవనరి 1వ తేది ఉదయం 6 గంటలకు వరకు ట్రాఫిక్‌ మార్పులు చేపట్టినట్టు నగర పోలీసు కమిషనర్‌ సందీప్‌రాయ్‌ రాథోడ్‌ పేర్కొన్నారు.

ట్రాఫిక్‌ మార్పులు...

- ఫోర్‌షోర్‌ సర్వీస్‌ రోడ్డు ఈనెల 31వ తేది సాయంత్రం 7 నుంచి జనవరి 1వ తేది ఉదయం 6 గంటల వరకు మూసివేత. ఈ రోడ్డులోకి వాహనాలు అనుమతించరు. అంతకు మునుపు పార్కింగ్‌ చేసిన వాహనాలు లైట్‌ హౌస్‌ జంక్షన్‌ నుంచి బయటకు వెళ్లాలి.

- యుద్ధస్మారక భవనం నుంచి లైట్‌హౌస్‌ వరకు ఉన్న కామరాజర్‌ రోడ్డు ఈనెల 31వ తేది రాత్రి 8 గంటల నుంచి జనవరి 1వ తేది ఉదయం 6 గంటల వరకు మూసివేత.

- అడయార్‌ నుంచి వచ్చే వాహనాలు కామరాజర్‌ రోడ్డుకు బదులుగా గ్రీన్‌వేస్‌ రోడ్డు జంక్షన్‌ మీదుగా సౌత్‌ కెనాల్‌ రోడ్డు జంక్షన్‌లో యూటర్న్‌ తీసుకొని మందవెల్లి, ఆర్‌.ఏ.పురం రెండో మెయిన్‌ రోడ్డు, ఆర్కే మఠ్‌ రోడ్డు, మైలాపూర్‌ లజ్‌ మీదుగా గమ్యస్థానాలకు చేరుకోవాలి.

- డాక్టర్‌ ఆర్కే రోడ్డు నుంచి వచ్చే వాహనాలు కామరాజర్‌ రోడ్డుకు బదులుగా వీఎం వీధి జంక్షన్‌, ఆర్కే మఠ్‌ రోడ్డు, లజ్‌ జంక్షన్‌, మందవెల్లి, సౌత్‌ కెనాల్‌ బ్యాంక్‌ రోడ్డు మీదుగా శాంథోమ్‌ హైరోడ్డు, గ్రీన్‌వేస్‌ రోడ్డును చేరుకోవాలి.

- ప్యారీస్‌ జంక్షన్‌ నుంచి కామరాజర్‌ రోడ్డు వైపుకు వచ్చే వాహనాలు ఆర్బీఐ సబ్‌వే (నార్త్‌), నార్త్‌ ఫోర్ట్‌ వాల్‌ రోడ్డు, ముత్తుస్వామి రోడ్డు, ముత్తుస్వామి బ్రిడ్జి, వాలాజా పాయింట్‌, అన్నాసాలై మీదుగా గమ్యస్థానాలకు వెళ్లాలి.

- వాలాజా పాయింట్‌, స్వామి శివానంద రోడ్డు (దూరదర్శన్‌ కేంద్రం సమీపం), వాలాజా రోడ్డు (విక్టోరియా హాస్టల్‌ రోడ్డు సమీపం), భారతి రోడ్డు జంక్షన్‌, డాక్టర్‌ బిసెంట్‌ రోడ్డు (ఎంఆర్‌టీఎస్‌ సమీపం), లాయిడ్స్‌ రోడ్డు జంక్షన్‌, నటేశన్‌ రోడ్డు జంక్షన్‌, డాక్టర్‌ ఆర్కే రోడ్డు నుంచి కామరాజర్‌ రోడ్డుకు వాహనాలను అనుమతించరు.

- సౌత్‌ కెనాల్‌ బ్యాంక్‌ రోడ్డు నుంచి లైట్‌ హౌస్‌ వరకు లూప్‌రోడ్డులో వాహనాలను ప్రవేశం లేదు.

- సౌత్‌ కెనాల్‌ రోడ్డు నుంచి ప్యారీస్‌ జంక్షన్‌ వెళ్లే వాహనాలు మందవెల్లి, వీకే అయ్యర్‌ రోడ్డు, సెయింట్‌ మెరీస్‌ రోడ్డు, లజ్‌, రాయపేట 1 పాయింట్‌, కేథడ్రల్‌ రోడ్డు, అన్నాసాలై మీదుగా వెళ్లాలి.

- ప్యారీస్‌ నుంచి అడయార్‌ వైపుకు వెళ్లే ఎంటీసీ బస్సులు ఆర్బీఐ నార్త్‌ మీదుగా వాలాజా పాయింట్‌, ముత్తుస్వామి పాయింట్‌, అన్నాసాలై, అన్నా రోటరీ, కేథడ్రల్‌ రోడ్డు, వీఎం వీధి జంక్షన్‌, లజ్‌ జంక్షన్‌, మందవెల్లి జంక్షన్‌ మీదుగా సౌత్‌ కెనాల్‌ రోడ్డుకు చేరుకొని గమ్యస్థానాలకు వెళ్లాలి.

- నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు ఈనెల 31వ తేది రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేది 6 గంటలకు వరకు మూసివేత.

కామరాజర్‌ రోడ్డులో పార్కింగ్‌ ప్రదేశాలు...

- స్వామి వివేకానంద రోడ్డు (దూరదర్శన్‌ కేంద్రం నుంచి పెరియార్‌ విగ్రహం వరకు సింగిల్‌ లైన్‌ పార్కింగ్‌)

- వాలాజా రోడ్డు (తమిళనాడు రాష్ట్ర గెస్ట్‌ హౌస్‌ నుంచి అన్నా విగ్రహం వరకు సింగిల్‌ లైన్‌ పార్కింగ్‌)

- భారతి రోడ్డు (విక్టోరియాల హాజర్‌ రోడ్డు జంక్షన్‌ నుంచి భారతి రోడ్డు జంక్షన్‌ వరకు సింగిల్‌ లైన్‌ పార్కింగ్‌)

- పీడబ్ల్యూడీ ఆఫీస్‌ రోడ్డు (దివ్యాంగుల సంక్షేమ కార్యాలయం నుంచి నటేశన్‌ రోడ్డు వరకు సింగిల్‌ లైన్‌ పార్కింగ్‌)

- డాక్టర్‌ బిసెంట్‌రోడ్డు(ఎమ్మార్టీఎస్‌నుంచిఐస్‌హౌస్‌వరకు సింగిల్‌లైన్‌ పార్కింగ్‌)

- లాయడ్స్‌ రోడ్డు (ఎమ్మార్టీఎస్‌ నుంచి ఐస్‌హౌస్‌ వరకు సింగిల్‌ లైన్‌ పార్కింగ్‌) ఫ క్వీన్‌ మేరీస్‌ కళాశాల ప్రాంగణం

ఎలియట్స్‌ బీచ్‌లో ట్రాఫిక్‌ మార్పులు

- ఈ నెల 31వ తేది రాత్రి 8 నుంచి జనవరి 1వ తేది ఉదయం 6 గంటల వరకు ఆరో అవెన్యూ రోడ్డులో వాహనాలకు అనుమతి లేదు.

- 5వ అవెన్యూ జంక్షన్‌, 4వ మెయిన్‌ రోడ్డు జంక్షన్‌, 3వ మెయిన్‌ రోడ్డు జంక్షన్‌, 16వ క్రాస్‌ వీధి జంక్షన్‌, 7వ అవెన్యూ ఎంజీ రోడ్డు నుంచి అన్నై వేలాంకన్ని చర్చి వైపుకు వెళ్లే 6వ అవెన్యూ మూసివేత.

ఎలియట్స్‌ బీచ్‌లో పార్కింగ్‌ ప్రాంతాలు...

- బిసెంట్‌ నగర్‌ 2, 3, 4, 5వ అవెన్యూలు

- బిసెంట్‌ నగర్‌ 3, 4వ మెయిన్‌ రోడ్లు.

Updated Date - Dec 31 , 2023 | 09:57 AM