New Year: న్యూ ఇయర్ వేడుకలపై ఫాం హౌస్‌లకు నిబంధనలు
ABN , Publish Date - Dec 22 , 2023 | 09:14 AM
నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొనే సమయంలో నిబంధనలు ఉల్లంఘించే ఫాం హౌస్‌లు, ప్రైవేటు విడిదుల లైసెన్స్ రద్దు
ఐసిఎఫ్(చెన్నై): నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొనే సమయంలో నిబంధనలు ఉల్లంఘించే ఫాం హౌస్‌లు, ప్రైవేటు విడిదుల లైసెన్స్ రద్దు చేయనున్నట్లు పోలీసు శాఖ(Police Department) హెచ్చరికలు జారీచేసింది. స్థానిక ఈసీఆర్ రోడ్డులో అక్కరై, పనయూర్, నైనార్‌కుప్పం, ఉద్దండి, కానాత్తూర్, ముట్టుకాడు వంటి ప్రాంతాల్లో ఫాం హౌస్‌లు, రిస్టార్ట్‌లున్నాయి. అక్కడ క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసంభావిత సంఘటనలు అడ్డుకొనేలా పోలీసు శాఖ వేడుకలపై నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు చేపట్టనున్నట్లు రిసార్ట్‌లు, ఫాం హౌస్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.
