Social Media Rules : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కొత్త నిబంధనలు

ABN , First Publish Date - 2023-01-21T20:33:51+05:30 IST

వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, మోసపూరిత ప్రకటనలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా

Social Media Rules : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కొత్త నిబంధనలు
Social Media

న్యూఢిల్లీ : వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, మోసపూరిత ప్రకటనలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు నూతన నిబంధనలను ప్రకటించింది. ఉత్పత్తులు, సేవలు లేదా పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియాలో వర్చువల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇకపై అన్ని వివరాలను తప్పనిసరిగా వెల్లడించవలసి ఉంటుంది. తాము పొందే బహుమతులు, హోటల్ వసతులు, ఈక్విటీ, డిస్కౌంట్లు, అవార్డులు వంటివాటినన్నిటినీ ప్రకటించాలి.

ఈ నిబంధనలను ఉల్లంఘించే తయారీదారులు (Manufacturers), ప్రకటనకర్తలు (advertisers), ఎండార్సర్స్‌కు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఈ జరిమానాను విధిస్తుంది. ఈ నిబంధనల ఉల్లంఘన పునరావృతమైతే రూ.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. అంతేకాకుండా మోసపూరితమైన ప్రకటనలను ఎండార్స్ చేసేవారిని ఒక సంవత్సరంపాటు ఎటువంటి ప్రకటనలను ఎండార్స్ చేయకుండా నిషేధించవచ్చు. అయినప్పటికీ మరోసారి ఉల్లంఘనలకు పాల్పడినవారిని మూడేళ్ళపాటు ఈ విధంగా నిషేధించవచ్చు.

అడ్వర్టయిజర్‌‌కు, సెలబ్రిటీ/ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మెటీరియల్ లింక్ ఉన్నపుడు ఈ విధంగా అన్ని వివరాలను వెల్లడించాలి. సెలబ్రిటీ/ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన రిప్రజెంటేషన్ వల్ల ఆ వస్తువు లేదా సేవ లేదా ఉత్పత్తి విలువ లేదా విశ్వసనీయత ప్రభావితమైనపుడు ఈ నిబంధనలను పాటించాలి.

Updated Date - 2023-01-21T20:33:57+05:30 IST