Parliament : నేడు నారీ శక్తివందన్ బిల్లుపై చర్చ..
ABN , First Publish Date - 2023-09-20T09:03:47+05:30 IST
మూడో రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్‌సభలో నారీ శక్తి వందన్ బిల్లుపై చర్చ జరగనుంది. బిల్లుపై చర్చకు 6 గంటల సమయం కేటాయించడం జరిగింది.

ఢిల్లీ : మూడో రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్‌సభలో నారీ శక్తి వందన్ బిల్లుపై చర్చ జరగనుంది. బిల్లుపై చర్చకు 6 గంటల సమయం కేటాయించడం జరిగింది.
మహిళలకు మరిన్ని పదవులు రానున్నాయి! చట్టసభల్లో మహారాణులుగా వెలిగే అవకాశం! దాదాపు మూడు దశాబ్దాల కల సాకారం కానున్న సందర్భం! పార్లమెంటు కొత్త భవనం ప్రారంభించిన రోజునే.. చరిత్రాత్మక బిల్లు పట్టాలకెక్కింది! లోక్‌సభలోనూ, రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రత్యేక సమావేశాల్లో పార్లమెంటు ముందుకు వచ్చింది! ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ పేరిట రూపొందించిన ఈ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటు కొత్త భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావడం విశేషం. బిల్లులోని 330ఏ క్లాజ్ ప్రకారం లోక్‌సభలోనూ, 332 క్లాజ్ ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన సీట్లతో సహా మూడో వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తారు.