Building Collapses: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2023-01-24T20:22:29+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో(Lucknow)లో విషాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల నివాస భవనం ఉన్నట్టుండి కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు

Building Collapses: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. ముగ్గురి మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో(Lucknow)లో విషాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల నివాస భవనం ఉన్నట్టుండి కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలో మంగళవారం కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భవనం కుప్పకూలడానికి అదే కారణమన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించాల్సి ఉంది.

భవనం శిథిలాల కింద నాలుగు కుటుంబాలు చిక్కుకున్నట్టు భావిస్తున్న అధికారులు శిథిలాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ముగ్గురిని రక్షించి వెలికి తీశారు. హజ్రత్‌గంజ్‌ నిండా పురాతన భవనాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఓ భవనమైన అలయా అపార్ట్‌మెంట్ నేడు కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పట్నాయక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాష్ట్ర, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం చేపట్టిన సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2023-01-24T20:22:30+05:30 IST